మహర్షి తర్వాత ఏంటి?

mahesh babu next movie with anil ravipudi - Sakshi

‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్‌’ సినిమాల విజయాలతో హ్యాట్రిక్‌ సాధించారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. లేటెస్ట్‌గా వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌తో అనిల్‌ తెరకెక్కించిన ‘ఎఫ్‌ 2’ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం ఈ దర్శకుడు ఇండస్ట్రీలో హాట్‌ ఫేవరెట్‌ డైరెక్టర్‌గా మారారు. ఈ యంగ్‌ డైరెక్టర్‌ నెక్ట్స్‌ ఎవరితో సినిమా చేయబోతున్నారు అంటే మహేశ్‌బాబు అనే సమాధానం వినిపిస్తోంది ఫిల్మ్‌నగర్‌ సర్కిల్‌లో.

ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. ‘మహర్షి’ పూర్తయిన వెంటనే అనిల్‌ రావిపూడి సినిమా స్టార్ట్‌ కానుందట. అయితే ఆల్రెడీ సుకుమార్‌తో సినిమాకి మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరి.. ‘మహర్షి’ తర్వాత ఏంటి? సుకుమార్‌ సినిమానా? అనిల్‌ రావిపూడితోనా? జస్ట్‌ నెల రోజుల్లో తెలుస్తుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top