కోలీవుడ్‌కు మహర్షి?

mahesh babu maharshi tamil remake in vijay - Sakshi

ఏదైనా సినిమా రిలీజై మంచి హిట్‌ సాధించినప్పుడు ఆ సినిమాను తమ భాషలో రీమేక్‌ చేయాలనుకుంటారు హీరోలు.  కానీ ‘మహర్షి’ కొంచెం ఫాస్ట్‌గా ఉన్నాడు. రిలీజ్‌ కాకముందే రీమేక్‌ అవ్వడానికి రెడీ అవుతున్నాడని తెలిసింది. కెరీర్‌లో 25వ సినిమా కోసం ‘రిషి’గా మారి ‘మహర్షి’ సినిమా చేశారు మహేశ్‌బాబు. మే 9న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. సినిమా రిలీజ్‌ కాకముందే ‘మహర్షి’ రీమేక్‌ కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను తమిళంలో విజయ్‌ రీమేక్‌ చేయనున్నారని తెలిసింది. ఆల్రెడీ మహేశ్‌ చేసిన ‘ఒక్కడు, పోకిరి’ సినిమాల తమిళ రీమేక్స్‌లో విజయ్‌ నటించారు. రెండూ పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు ‘మహర్షి’ రీమేక్‌లో నటిస్తే ఇది మూడో సినిమా అవుతుంది. ఈ సినిమాను ఎవరు రూపొందిస్తారు? నిర్మిస్తారు అన్న సంగతి తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top