‘మహర్షి’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే!

Mahesh Babu Maharshi First Day Collections - Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా మహర్షి. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి డివైడ్‌ టాక్‌ వచ్చినా భారీ వసూళ్లు సాధించింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావటం, అడ్వాన్స్‌ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరగటంతో మహర్షి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 24.6 కోట్ల షేర్‌ సాధించింది.
(చదవండి : ‘మహర్షి’ మూవీ రివ్యూ)

ఓవర్‌ సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల వసూళ్లు కూడా కలుపుకుంటే ఈ లెక్క 30 కోట్ల మార్క్‌ను చేరుతుందని భావిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. అల్లరి నరేష్‌, జగపతి బాబు, ప్రకాష్‌ రాజ్‌, జయసుథ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top