'ఆగడు'లో పాట పాడనున్న మహేష్ బాబు!

'ఆగడు'లో పాట పాడనున్న మహేష్ బాబు!


హీరో అంటే కేవలం డాన్సులు చేయడం, నటించడమే కాదు.. పాటలు కూడా పాడతామని అంటున్నారు మన బాలీవుడ్ హీరోలు. ఇంతకుముందు చాలామంది హీరోలు పాటలకు తమ గళాలు విప్పారు. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూడా పయనిస్తున్నారు. తాజాగా తాను నటిస్తున్న 'ఆగడు' సినిమా కోసం ఒక పాట పాడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఆగడు చిత్రం షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. తమన్, శ్రీనువైట్ల ఇద్దరూ కూడా మహేష్ను ఈ సినిమాలో ఓ పాట పాడాల్సిందిగా అడిగారని, అయితే ఇంకా ఆయన పాడేదీ లేనిదీ నిర్ధారించాల్సి ఉందని సినిమా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆగడు సినిమాలో సమంత, రాజేంద్రప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top