రాజకీయాల గురించి చాలా తెలుసుకున్నా

Mahesh Babu about Bharat Ane Nenu Movie Story - Sakshi

ప్రయోగాలా.. నాన్నగారి ఫ్యాన్స్‌ కొడతారండి.నాన్న గారి సినిమాల రీమేక్స్‌లోనా.. చెడగొట్టనండి. ఇండియా బెస్ట్‌.. ఫారిన్‌లో వారం మించి ఉండలేమండి. రాజకీయాలా.. మనవల్ల కాదండి.ఇలా సరదా సరదా మాటలతో బుధవారం మహేశ్‌బాబు మీడియాతో ముచ్చటించారు. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘భరత్‌ అనే నేను’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు.

► జనరల్‌గా సినిమా రిలీజ్‌ తర్వాత ఫ్యామిలీతో టూర్‌ వెళతారు.. ఈసారి రిలీజ్‌కు ముందే వెళ్లారు?  
ప్రతీసారి సినిమా రిలీజ్‌ అయ్యాక టూర్‌కి వెళ్లేవాళ్లం. కానీ ఈసారి ముందే వెళ్లిపోయాం. సినిమా మీద కాన్ఫిడెన్స్‌. నా కెరీర్‌లోనే బెస్ట్‌ ప్రీ రిలీజ్‌ ఫేజ్‌ అనుకోవచ్చు. ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను. సినిమా రిలీజ్‌ అవ్వకముందే ఒక బ్లాక్‌బాస్టర్‌ వైబ్‌లా ఉంది.

► రాజకీయాలంటే అస్సలు శ్రద్ధ లేని మీకు సీయం క్యారెక్టర్‌ చేయడం ఎలా అనిపించింది?
శివగారు ఈ సబ్జెక్ట్‌ చెప్పగానే ఎగై్జటింగ్‌గా అనిపించింది. సేమ్‌టైమ్‌ భయంగానూ అనిపించింది. సీయం క్యారెక్టర్‌ చేయడం ఒక పెద్ద హానర్, పెద్ద రెస్పాన్సిబులిటీ కూడా. ఈ కథతో రెండు సంవత్సరాలు ట్రావెల్‌ అవడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. అయితే రాజకీయాల్లోకి రావాలని కాదు (నవ్వుతూ).

► సీయం పాత్ర కోసం హోమ్‌ వర్క్‌ చేశారా?
లేదు. మా బావ జయదేవ్‌ గల్లాగారి పార్లమెంట్‌ వీడియోస్‌ కొన్ని చూశాను. అంతే. పెద్దగా హోమ్‌ వర్క్‌ ఏం చేయలేదు. శివగారి ఇన్‌పుట్సే తీసుకున్నాను. మొత్తం క్రెడిట్‌ ఆయనకే ఇస్తాను. ఒక పొలిటికల్‌ సినిమాకు డైలాగ్స్‌ రాయడం అంటే చాలా కష్టం. లాజిక్స్‌ కరెక్ట్‌గా ఉండాలి. నేనెక్కడా నెర్వస్‌గా కాకుండా పర్ఫెక్ట్‌గా కనిపించడానికి చాలా వర్క్‌ చేశాం. ఎక్స్‌ట్రార్డినరీగా క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు. పొలిటికల్‌ సినిమాల్లో డైలాగ్స్‌ మనం రోజూ మాట్లాడుకునే మాటల్లా ఉండవు. ఫస్ట్‌ టైమ్‌ నా కెరీర్‌లో పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పాను. పేజీల పేజీల డైలాగ్స్‌ అన్నమాట (నవ్వుతూ). కొంచెం కష్టం అనిపించింది. శివగారి హెల్ప్‌తో ఈజీగా పుల్‌ ఆఫ్‌ చేశాను.

► ట్వీట్స్‌లో ‘మేం మాస్టర్‌ పీస్‌ తీశాం’ అన్నారు. సినిమా చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆ ఫీలింగ్‌ కలిగింది?
ఫస్ట్‌ డే కథ విన్నప్పటి నుంచి ఈ ఫీలింగ్‌ ఉంది. దానికి దేవి ఇచ్చిన థీమ్‌ సాంగ్‌ ఓ కారణం. ఆ సాంగ్‌ ఫస్ట్‌ విన్నప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. అది విన్నప్పుడే ఒక వైబ్‌ స్టార్ట్‌ అయిపోయింది మా అందరిలో. అసెంబ్లీ సెట్‌ అవ్వనీయండి. ఆ సెట్‌ డిజైన్‌ అద్భుతంగా వేశారు మా ఆర్ట్‌ డిజైనర్‌ సురేశ్‌. అసెంబ్లీలో షూట్‌ ఉన్నా లేకున్నా అందరం వచ్చేవాళ్లం. ఒక నిజమైన అసెంబ్లీ సెషన్‌ ఎలా జరుగుతుందో అలానే చేశాం.

► ప్రజెంట్‌ రాజకీయ పరిస్థితి మీద ఈ సినిమా సెటైర్‌గా ఉండబోతోందా?
అస్సలు కాదు. స్ట్రైట్‌ ఫార్వార్డ్‌ , హానెస్ట్‌ కథ. సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ సినిమాను అందరు రాజకీయ నాయకులు చూసి మమ్మల్ని అప్రిషియేట్‌ చేస్తారనుకుంటున్నాను.

► ఈ సినిమా చేశాక రాజకీయాల మీద ఇంట్రెస్ట్‌ ఏమైనా పెరిగిందా?
రాజకీయాలకు, నాకు అస్సలు సంబంధం లేదండి. సినిమానే నా ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌.. నా ప్రాణం.  నా జీవితం సినిమాలకు అంకితం.

► సినిమాలో ‘మాట మీద ఉండాలి’ అన్నారు. మీరేం నేర్చుకున్నారు ఈ కథ నుంచి? ‘భరత్‌’ పాత్ర నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది?
ఒక సంవత్సరం ఒక కథతో జర్నీ చేస్తే కచ్చితంగా దాని ప్రభావం మన మీద ఉంటుంది.  ఇంకా రెస్పాన్సిబుల్‌ సిటిజన్‌లా ఉండాలని ఫీల్‌ అయ్యాను. ఒక పాత్ర నుంచి త్వరగా డిస్కనెక్ట్‌ అవ్వడం కొంచెం కష్టమే. అందుకే సరదాగా ఫ్యామిలీతో ట్రిప్‌కు వెళ్లాను (నవ్వుతూ).

► పాలిటిక్స్‌ గురించి స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఉంటుందా?
శివగారి ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్‌ ఉంటుంది. అలాగే ఇందులోనూ ఉంది. పర్టిక్యులర్‌గా వీళ్లకు అని చెప్పను కానీ.. అందరూ ఈ సినిమా చూడాలి. ఒక పొలిటికల్‌ ఫిల్మ్‌ వచ్చి నాకు గుర్తుండి చాలా రోజులైపోయింది. మళ్లీ ఈ జానర్‌ని తీసుకొచ్చాం అనిపిస్తుంది.

► ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ సినిమా ఇంపాక్ట్‌ ఇస్తుందనుకుంటున్నారా?
నేను కామెంట్‌ చేయదలుచుకోలేదు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే అని నమ్ముతాను. దాంట్లో ఏదైనా మెసేజ్‌ ఇచ్చి, అది ఆడియన్స్‌ కనెక్ట్‌ అయి ఫాలో అయితే ఇంకా ఆనందపడతాం. మా సినిమా ఇలా చేంజ్‌ చేస్తుంది అని నేను చెప్పలేను.

► సినిమా అంటేనే కమర్షియల్‌. ఇందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఏంటి?  
శివగారు కమర్షియల్, మాస్‌ ఎలిమెంట్స్‌ని ఎప్పుడూ వదలరు. పొలిటికల్‌ ఫిల్మ్‌లో కమర్షియల్‌ పాయింట్స్‌ ఎలా మిక్స్‌ చేశారు? అనే క్యూరియాసిటీ అందరికీ ఉండి ఉంటుంది. సీయం ఎలా ఫైట్‌ చేస్తాడు? సీయం ఎలా డ్యాన్స్‌ చేస్తాడు? అని. అదే మా సినిమాలో యూనిక్‌ సెల్లింగ్‌ పాయింట్‌.

►  ‘శ్రీమంతుడు’ అప్పుడు చాలామంది గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత కూడా అలా ఏదైనా జరుగుతుంది అనుకుంటున్నారా?
ఆడియన్స్‌ కూడా పాలిటిక్స్‌ మీద ఇంకా రెస్పాన్సిబుల్‌గా ఫీల్‌ అవుతారనుకుంటున్నాను. ఇంకా బాగా కనెక్ట్‌ అవ్వాలనుకుంటున్నాను.

► సీయం క్యారెక్టర్‌ ప్లే చేశాక ఆ పదవి లగ్జరీగా అనిపించిందా? లేక బాధ్యత ఎక్కువ అనిపించిందా?
బాధ్యత. అది నార్మల్‌ జాబ్‌ కాదండి. అలాంటి పాత్రను చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అవుతున్నాను. సీయం అనగానే జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ సెక్యూరిటీతో కాన్వాయ్‌ వేసుకొని తిరగడం కాదు, దానికి మించిన రెస్పాన్సిబులిటీలు ఉంటాయి. ఒక స్టేట్‌ని ఎలా కాపాడాలి? అని ఆలోచిస్తుంటారు. సీయం పదవి చాలా గొప్ప బాధ్యత. జనాన్ని  రిప్రజెంట్‌ చేయడం, వాళ్లను లుక్‌ ఆఫ్టర్‌ చేయడం నిజంగా జోక్‌ కాదు. ఇవన్నీ నేనెలా మాట్లాడుతున్నానంటే నేను స్క్రిప్ట్‌తో ట్రావెల్‌ చేశాను. సినిమా వల్ల రాజకీయాల మీద అవగాహన పెరిగింది.

► ఫస్ట్‌ ఓత్‌ అంటూ ప్రమాణస్వీకారం చెప్పారు కదా. ఇంట్లో పిల్లలు అవేమన్నా చెబుతున్నారా?
చెప్పట్లేదు. పొలిటికల్‌ పదాలు అయ్యేసరికి వాళ్లకి సరిగ్గా చెప్పటం రావడంలేదు. అయితే పాటలు పాడుతున్నారు.

► గత రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు.  సో.. ఈ సినిమా హిట్‌ అవ్వాల్సిందే అనే ప్రెజర్‌ ఏమైనా ఉందా?
ప్రతి సినిమా బాగా ఆడాలనే చేస్తాం. ప్రతి సినిమా అప్పుడు ప్రెజర్‌ ఉంటుంది. ఏ సినిమా చేసినా సూపర్‌ హిట్‌ అవ్వాలనే చేస్తాం. కానీ ఈ సినిమాకు మాత్రం ప్రీ రిలీజ్‌ వైబ్‌ చాలా బాగా అనిపిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ అనిపించలేదు.

► సినిమా మీద అంత కాన్ఫిడెన్స్‌ ఎలా వచ్చింది?
శివగారు ఈ సినిమా కథ ఐదు గంటలు చెప్పారు. ఇదంతా సినిమాలో ఎలా పడుతుందనుకున్నాను. ప్రతీ సీన్‌ ఎగై్జటింగ్‌గా అనిపించింది. అయితే చాలా సీన్స్‌ సినిమాలో పెట్టలేకపోయాం. చాలా బాధగా ఉంది. ఈ ఐదు గంటల సీన్స్‌ సినిమాలో పెట్టాలంటే రెండు పార్ట్స్‌గా తీయాలి.

► సినిమా మొత్తం సీయంగానే కనిపిస్తారా?
స్టార్టింగ్‌ పది నిమిషాల నుంచి సినిమా మొత్తం  సీయంగానే కనిపిస్తాను.

► 2019 ఎలక్షన్స్‌లో ప్రచారం చేయనున్నారా?
అస్సలు లేదు. 2019 సమ్మర్‌లో ఎక్కడో ఫారిన్‌లో షూటింగ్‌లోనో, హాలీడేలోనో  ఉంటానేమో (నవ్వుతూ)

► ఈ సినిమా చేస్తున్నప్పుడు సొసైటీ ఇంకా మారడం లేదేంటి? అని ఎప్పుడైనా బాధేసిందా?
నేను సినిమాలో సీయంగా చేశాను అని చెప్పడం కాదు కానీ వాళ్లంతా వాళ్ల బెస్ట్‌ ఇస్తూనే ఉన్నారు. ఇండియా చాలా పెద్ద దేశం. అందరూ తమ వంతుగా కృషి చేస్తూనే ఉన్నారు.

 ► ఇంతకీ మీ బెస్ట్‌ సీయం ఎవరు?
రెండు రోజుల్లో సినిమా రిలీజ్‌ ఉంది. కాంట్రవర్శీ వద్దు. ఇంత టెన్షన్‌లో ఏదో ఒకటి నా నుంచి రాబట్టాలనే (నవ్వుతూ).

► నటుడిగా మీ నాన్నగారి ప్రభావం మీ మీద ఏమైనా?
డెఫినెట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా ఎక్కువ ఫీల్‌ అయ్యాను. ముఖ్యంగా ఫస్ట్‌ ఓత్‌ అప్పుడు చాలామంది ‘అచ్చం నాన్నగారి గొంతులాగే ఉంది’ అని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. ఎవరో అడిగారు ‘డిజిటల్‌గా ఏదైనా మార్చారా?’ అని. ‘అలా అవ్వదండి. నా గొంతే’ అని చెప్పాను. డబ్బింగ్‌ థియేటర్‌లో నాన్నగారి వాయిస్‌లా అనిపించిందని నేనే అన్నాను. ఆయన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోనో, ‘ఈనాడు’లోనే∙ఇలాంటి హైపిచ్‌ డైలాగ్స్‌ పలికారు.

► ఇప్పుడు ఫస్ట్‌ 10 డేస్‌ సినిమా కలెక్షన్స్‌ బెంచ్‌ మార్క్‌. ప్రెజర్‌ ఫీలవుతున్నారా?
అలా ఏమీ లేదు. పెద్ద సినిమాలు హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఇప్పుడు చాలా థియేటర్స్‌ ఉన్నాయి. ఫస్ట్‌ వీక్‌లోనే డబ్బులన్నీ లాగేయడానికి ట్రై చేస్తున్నాం. మార్నింగ్‌ షో నుంచే టాక్‌ బాగుంటే ఆన్‌ బిలీవబుల్‌గా ఉంటోంది. ‘రంగస్థలం’ సినిమా అంత పెద్ద హిట్‌ అవడం చాలా ఆనందంగా ఉంది.

► ఫారిన్‌ వెళ్తుంటారు.. ఇక్కడకన్నా అక్కడ బాగుం టుందా?
మన ఇండియాలో ఉన్నట్లు వేరే ఎక్కడా∙ఉండదు. ఆనందం అంతా ఇక్కడే. ఫారిన్‌ వెళ్లినప్పుడు వన్‌ వీక్‌ తర్వాత ఎప్పుడెప్పుడు ఇండియాకి వచ్చేద్దామా అనిపిస్తుంటుంది.

►  ప్రొడ్యూసర్‌ దానయ్యగారు మీతో సినిమా చేయాలని 2006 నుంచి ట్రై చేస్తున్నానని చెప్పారు?
నిజానికి 2006 నుంచి కాదు. 2002 నుంచే. ‘మురారి’ షూటింగ్‌ జరుగుతున్నప్పుడే అడిగారు. వెయ్యి రూపాయల నోట్‌ లాంచ్‌ చేశారు. చూశారా? అని నాకు చూపించారు. మీరు ఒప్పుకుంటే అడ్వాన్స్‌ కూడా ఇలానే ఇస్తాను అన్నారు. నాకు ఇంకా గుర్తు (నవ్వుతూ). నేనూ  దానయ్యగారితో వర్క్‌ చేయాలనుకున్నాను. కుదర్లేదు. ఫైనల్‌గా ఈ సినిమాతో కుదిరింది.

► మీ నాన్నగారు నటించినవాటిలో ఏదైనా మూవీని రీమేక్‌ చేయాలనుకుంటున్నారా?
లేదండి. ఆయన సినిమాలు రీమేక్‌ చేసి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం ముందే చెప్పేశాను.

► వంశీ పైడిపల్లితో చేయబోయే మూవీ గురించి?
చాలా బావుంటుంది. వంశీకి థ్యాంక్స్‌ చెప్పాలి. నాకోసం ఒక ఏడాది పాటు బెంచిలో కూర్చున్నాడు. ఏ సినిమా ఒప్పుకోకుండా.

► త్రివిక్రమ్, సుకుమార్, సందీప్‌ రెడ్డిలతో సినిమాలు ఉన్నాయట?
ఉంటాయి. అన్నీ డిస్కషన్‌ స్టేజ్‌లో ఉన్నాయి.

► ఆడియో ఫంక్షన్లో ఎన్టీఆర్‌ ‘మహేశ్‌ అన్న చాలా ప్రయోగాలు చేశారు’ అన్నారు. మరి.. ఇంకా కొనసాగించాలనుకుంటున్నారా?
ప్రయోగాలు చేసే ఓపిక పోయింది. అలసిపోయాను. నాన్నగారి అభిమానులందరూ ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు. సో... కమర్షియల్‌ సినిమాలపై ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నాను.

► రామ్‌చరణ్, ఎన్టీఆర్, మీరు చాలా క్లోజ్‌గా ఉంటారు. మీరంతా కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు?
సినిమాలు తప్ప అన్నీ మాట్లాడుకుంటాం. మేం కూడా సినిమాలు మాట్లాడుకుని ఏం చేస్తాం? (నవ్వుతూ). బయటి ఫ్రెండ్స్‌ ఎలా మాట్లాడుకుంటారో అలానే మాట్లాడుకుంటాం.

► ఆడియో ఫంక్షన్‌లో ‘మీరూ మీరూ బాగుండాలని ఫ్యాన్స్‌తో అన్నారు. అంటే ఫ్యాన్స్‌లో ఏమైనా చేంజ్‌ కోరుకుంటున్నారా?
ఫ్యాన్స్‌లో చేంజ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయడం లేదు. సోషల్‌ మీడియా ఇంపాక్ట్‌ తెలిసిందే. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్‌ అవుతున్నప్పుడు.. మిగతా పెద్ద హీరోల ఇంకొన్ని సినిమాలు తీసుకుని ఆ సినిమాపై కాన్సంట్రేట్‌ చేయడం ట్రెండ్‌ అయింది. ఇట్స్‌ నాట్‌ ఫెయిర్‌. సినిమా అంటే మేం (హీరోలు) ఒక్కళ్లమే కాదు. ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అందరిలో పాజిటివ్‌ వైబ్‌ కావాలనుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top