నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం | Maharshi second song release | Sakshi
Sakshi News home page

నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం

Apr 13 2019 12:50 AM | Updated on Apr 13 2019 12:51 AM

Maharshi second song release - Sakshi

మహేశ్‌బాబు

‘మహర్షి’ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతోంది. దాంతో ప్రమోషనల్‌ కార్యక్రమాల స్పీడ్‌ పెంచింది చిత్రబృందం. ఇటీవలే ఫస్ట్‌ సాంగ్, టీజర్‌ను రిలీజ్‌ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. లేటెస్ట్‌గా సెకండ్‌ సాంగ్‌ ‘నువ్వే సమస్తం... నువ్వే సిద్ధాంతం..’ను శుక్రవారం రిలీజ్‌ చేసింది. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక.

అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే ‘నువ్వే సమస్తం. నువ్వే సిద్ధాంతం..’ సాంగ్‌ ఉత్తేజ గీతంలా అనిపిస్తోంది. హీరోను ఎలివేట్‌ చేసేలా ఈ సాంగ్‌ కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా యాజిన్‌ నిజర్‌ పాడారు. మే9న ‘మహర్షి’ రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement