తోటమాలినౌతున్నా : కీర్తీ సురేష్ | Mahanati Fame Keerthy Suresh Future Plans | Sakshi
Sakshi News home page

Oct 14 2018 10:04 AM | Updated on Oct 14 2018 10:04 AM

Mahanati Fame Keerthy Suresh Future Plans - Sakshi

యువ నటి కీర్తీసురేశ్‌ సడన్‌గా సినిమాకు బ్రేక్‌ ఇచ్చి తోటమాలినవుతున్నానంటోంది. ఏమిటీ విపరీత నిర్ణయం అని షాక్‌ అవుతున్నారా? మీరు అవాక్కు అయినా, ఇంకేమయినా అయినా ఇది నిజం. ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ కథానాయకి కీర్తి. ఒక్క మహానటి చిత్రంతోనే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఆ తరువాత కూడా స్టార్‌ నటులు విజయ్‌తో సర్కార్, విశాల్‌కు జంటగా సండైకోళి– 2 చిత్రాలు చేస్తూ కమర్శియల్‌ చిత్రాల హీరోయిన్‌గానూ రాణిస్తోంది.

ఈ బ్యూటీకిప్పుడు వరుసగా మూడు విశేష సంఘటనలు వరుసగా వచ్చి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. ఈ నెల 17న ఈ అమ్మడు పుట్టిన రోజు జరుపుకోనుంది. మరో విశేషం ఈమె నటించిన సండైకోళి–2 చిత్రం ఈ నెల 18వ తేదీన తెరపైకి రానుంది. ఇక మూడోది విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న సర్కార్‌ చిత్రం టీజర్‌ ఈ నెల 19న విడుదల కానుంది. ఇలా వరుస ఎగ్జైట్‌మెంట్స్‌తో కీర్తీసురేశ్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

సండైకోళి–2 చిత్రం తనకు బర్త్‌డే గిఫ్ట్‌ అని భావిస్తున్న ఈ బ్యూటీ ఈ సందర్భంగా తన అభిమానులకు ఊహించని షాక్‌ న్యూస్‌ ఒకటి వెల్లడించింది. అదేమిటంటే రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్‌ ఇస్తుందట. ఇందుకు ఆ అమ్మడు చెప్పే రీజన్‌ మూడేళ్లగా రెస్ట్‌ లేకుండా నటిస్తున్నాననే. ఈ మూడేళ్లలో ఇన్ని చిత్రాలు చేశానా అని తనకే ఆశ్చర్యంగా ఉందంటున్న కీర్తీ విరామం లేకుండా, సరిగా నిద్రకూడా పోవడానికి సమయం లేనంతగా నటించానని చెప్పింది. 

అదే సమయంలో కొత్తగా మరో 20 కథలు విన్నానని, అయితే వాటిలో దేనికీ ఇంకా ఒప్పందం చేయలేదని చెప్పింది. ముందు రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగని విదేశాలకు వెళుతున్నానని భావించేరు సుమా! అలాంటి ఆలోచనలేమీ లేవు అని చెప్పింది.

ఇంట్లోనే ఉంటానని, తోట పని చేస్తాను, కవితలు రాస్తాను, వంటలు చేస్తాను. వ్యవసాయం చేయడం కూడా నేర్చుకున్నాను, అది కూడా చేస్తాను అని అంటోంది. ఆ తరువాతనే మళ్లీ నటిస్తానని కీర్తీసురేశ్‌ పేర్కొంది. కారణాలేమైన తమిళంలో నటుడు శశికుమార్‌తో నటించే అవకాశాన్ని జారవిడుచుకుంది. ప్రస్తుతం చేతిలో ఒక్క మలయాళ చిత్రం మాత్రమే ఉంది. దాన్ని పూర్తి చేసి నటనకు చిన్న బ్రేక్‌ తీసుకోనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement