యశ్‌చోప్రాకు నివాళిగా శ్రీదేవి, మాధురి ర్యాంప్ వాక్ | Madhuri Dixit , Sridevi to walk the ramp as tribute to Yash Chopra | Sakshi
Sakshi News home page

యశ్‌చోప్రాకు నివాళిగా శ్రీదేవి, మాధురి ర్యాంప్ వాక్

Sep 21 2013 10:42 PM | Updated on Sep 1 2017 10:55 PM

ప్రముఖ దర్శకనిర్మాత దివంగత యశ్‌చోప్రాకు నివాళిగా శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు ర్యాంప్‌వాక్ చేయనున్నారు.


ముంబై: ప్రముఖ దర్శకనిర్మాత దివంగత యశ్‌చోప్రాకు నివాళిగా శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు ర్యాంప్‌వాక్ చేయనున్నారు. చోప్రా జయంతిని వైవిధ్యంగా జరపాలని భావించిన ఆయన సతీమణి పమేలా చోప్రా ఈ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నారు. ఈ నెల 27న నిర్వహించనున్న ఈ ఫ్యాషన్ షోలో దశాబ్దకాలానికిపైగా బాలీవుడ్‌ను ఏలిన శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌తోపాటు రాణీ ముఖర్జీ, జూహీ చావ్లా, ప్రీతీ జింతా తదితర తారలు కూడా తమ అందచందాలతో ఆహూతులను అలరించనున్నారు. దేశంలో ఏటా నిర్వహించే ఫ్యాషన్ షోలకు ధీటుగా దీనిని నిర్వహించాలని, అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని పమేలా భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు తెలిపారు.

 

బాలీవుడ్‌కు ఫ్యాషన్‌ను పరిచయం చేసినవారిలో యశ్‌చోప్రాకు ప్రత్యేక స్థానముందని, ఆ ఫ్యాషన్‌తోనే ఆయనకు నివాళులర్పించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన కరోల్‌బాగ్ శారీ హౌస్ తమవంతు సహకారాన్ని అందిస్తోందన్నారు. దేశంలోని వివిధ భాషా చిత్రాల్లో నటిస్తున్న తొమ్మిది మంది నటీమణులు ఈ షోలో పాల్గొంటారని, వీరితోపాటు ప్రముఖ డిజైర్లు కూడా తాము రూపొందించిన దుస్తులను ఈ షోలో ప్రదర్శించే అవకాశముందని చెప్పారు. ఇక సినీ తారలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తమ కెరీర్‌ను మలుపుతిప్పిన దర్శకుల్లో యశ్‌చోప్రా ఒకరని, ఆయనకు నివాళి అర్పించే అవకాశం ఈ రూపంలో దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని ఇందులో పాల్గొనే తారలు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement