‘‘ఇందులో నేను లవ్గురుగా కనిపిస్తాను. చిలిపి సరదాల దృశ్యరూపంగా అనిపించే అల్లరి ప్రేమికుల కథ ఇది’’ అని శ్రీ అన్నారు. కృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీ, హరిప్రియ జంటగా డి.రాజేంద్రప్రసాద్వర్మ నిర్మించిన చిత్రం ‘గలాట’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ విలేకరులతో ముచ్చటించారు.
‘కొత్త దర్శకులతో ఇక చేయకూడదు అనుకున్నాను. కానీ... అద్భుతమైన కథ చెప్పి నన్ను ఒప్పించాడు దర్శకుడు కృష్ణ. ఎంత బాగా చెప్పాడో, అంతకు తగ్గ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. బామ్మకు నచ్చే లక్షణాలున్న అమ్మాయిని వెతుక్కుంటూ ముంబయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ కుర్రాడికి వెతకబోయే తీగ కాలికి తగిలినట్లు తనకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఓ అమ్మాయి గుళ్లో పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ మంత్రి వల్ల సమస్యల్లో పడిన ఆ అమ్మాయిని హీరో ఎలా కాపాడి, తనదాన్ని చేసుకున్నాడు? అనేది ఈ సినిమా కథాంశం.
కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచాడు. జంధ్యాలగారి సినిమా చూస్తున్న ఫీల్ కలిగిస్తుందీ సినిమా’’ అని చెప్పారు. సునీల్ కశ్యప్ శ్రావ్యమైన బాణీలిచ్చారని, కృష్ణ నటించిన ‘గూఢచారి 116’లోని ‘నువ్వునా ముందుంటే..’ పాటను ఏ మాత్రం మార్చకుండా యథాతథంగా పెట్టామని శ్రీ తెలిపారు. ‘ఈ రోజుల్లో, బస్టాప్’ చిత్రాలకు పనిచేసిన కిరణ్ దర్శకత్వంలో ‘సాహసం సేయరా డింభకా’ చిత్రం చేయనున్నట్లు ఆయన చెప్పారు.
నేను లవ్ గురూని..!
Published Fri, Apr 11 2014 2:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాక్షస పరివార్..
లెజెండ్రీ నటుడికి నివాళిగా.. నబా నటేష్ ఇలా మారిపోయింది! (ఫోటోలు)
బీజేపీ ‘ప్యూన్’ వ్యాఖ్యలు.. స్పందించిన అమేథీ అభ్యర్థి
అత్యధిక మిలియనీర్స్ ఉన్న భారతీయ నగరం ఇదే..!
కూటమికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
SRH: సన్రైజర్స్ గుండెల్లో గుబులు.. మ్యాచ్ గనుక రద్దైతే!
కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
అందరూ పోలింగ్లో పాల్గొనాలి: అదానీ
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement