అమ్మో డబ్బు ఖర్చు చేయడం తప్పు: నటి | Lily James's money guilt | Sakshi
Sakshi News home page

అమ్మో డబ్బు ఖర్చు చేయడం తప్పు: నటి

Sep 25 2016 11:59 AM | Updated on Apr 3 2019 9:12 PM

అమ్మో డబ్బు ఖర్చు చేయడం తప్పు: నటి - Sakshi

అమ్మో డబ్బు ఖర్చు చేయడం తప్పు: నటి

డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తే తనకు అపరాధంగా అనిపిస్తుందని ప్రముఖ హాలీవుడ్ నటి లిలీ జేమ్స్ చెప్పింది.

లండన్:డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తే తనకు అపరాధంగా అనిపిస్తుందని ప్రముఖ హాలీవుడ్ నటి లిలీ జేమ్స్ చెప్పింది.ఇప్పటికీ తాను ఒక నటిగా సంపాధిస్తున్న మొత్తాన్ని ఒక క్రమపద్ధతిలో ఖర్చు చేస్తుంటానని, సర్దుబాటు చేసుకుంటానని చెబుతోంది. 'వస్తువులపై పెద్దమొత్తంలో వ్యయం చేయాలంటే నాకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకు వచ్చన తొలి సంపాదనతో షాపింగ్ చేద్దామని వెళ్లామని వెళ్లాను. తొలుత ఓ చోలి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను.

దాని రేటు 700 పౌండ్లు ఉంది. అంతపెద్ద మొత్తం అవసరమా అనిపించి తిరిగి వెనుకకు ఇచ్చేశాను' అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. అంతేకాదు.. తాను తన అభిమానుల ఉద్దేశాలను పసిగట్టలనని, వారు తన గురించి ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో తెలుసుకోగలనని పేర్కొంది. ఆటోగ్రాఫ్స్‌ కోసం ఎక్కువమంది ఎగబడుతుంటారని, పైకి చూడటానికి అది సంతోషంగా అనిపించినా వాస్తవంగా కొంత ఇబ్బందిగా అనిపిస్తుంటుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement