ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే!

Lakshmi Rai gets into IPS officer's shoes for Jhansi - Sakshi

...చాలే ఇది చాలే అంటూ ఫుల్‌గా ఆనందపడిపోతున్నారు హీరోయిన్‌ రాయ్‌లక్ష్మి. ఈ సాంగ్‌ ‘గీతగోవిందం’ లోనిదే కావచ్చు. కానీ ఆ మూమెంట్‌ను ఇప్పుడు రాయ్‌లక్ష్మి కూడా ఫీల్‌ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. దాదాపు ఆరేళ్ల తర్వాత కన్నడలో ‘ఝాన్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. పీవీఎస్‌ గురుప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ రీసెంట్‌గా మొదలైంది. ఇందులో ఐపీఎస్‌ ఆఫీసర్‌ ఝాన్సీ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మి. ఈ సినిమా సెట్స్‌కు రాయ్‌లక్ష్మి తల్లి వెళ్లారు. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా? విషయం ఉంది. 

‘‘నా సినీ కెరీర్‌ (దాదాపు పదకొండేళ్ల కెరీర్‌) లో ఫస్ట్‌ టైమ్‌ మా అమ్మగారు సెట్స్‌కు వచ్చారు. ఇంతకన్నా నాకు ఇంకేం స్పెషల్‌ ఉంటుంది. ఇది నా లైఫ్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ మూమెంట్స్‌’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఇంతకు ముందు 2012లో  వచ్చిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మి. తమిళంలో వచ్చిన ‘కాంచన’ చిత్రానికి ఇది రీమేక్‌. అలాగే ప్రస్తుతం సౌత్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ‘వేర్‌ ఈజ్‌ వెంకట్‌లక్ష్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె టీచర్‌ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కిశోర్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top