'పెళ్లిచూపులు' తప్పక చూడాలి: కేటీఆర్ | Kudos to Tarun and team, must watch the movie, tweets Minister KTR | Sakshi
Sakshi News home page

'పెళ్లిచూపులు' తప్పక చూడాలి: కేటీఆర్

Aug 17 2016 5:20 PM | Updated on Aug 30 2019 8:24 PM

'పెళ్లిచూపులు' తప్పక చూడాలి: కేటీఆర్ - Sakshi

'పెళ్లిచూపులు' తప్పక చూడాలి: కేటీఆర్

చిన్నగా ధియేటర్లకు వచ్చి పెద్ద హిట్ అయిన 'పెళ్లిచూపులు' తప్పక చూడాల్సిన సినిమా అంటూ ఐటీ మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు.

చిన్నగా థియేటర్లకు వచ్చి పెద్ద హిట్ అయిన 'పెళ్లిచూపులు' తప్పక చూడాల్సిన సినిమా అంటూ ఐటీ మంత్రి కేటీఆర్ కితాబునిచ్చారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ను, చిత్ర యూనిట్ను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 'పెళ్లిచూపులు' టీంతో కలిసి సినిమాను చూసిన ఆయన ఇది సందేశాత్మక చిత్రమంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

మహిళా సాధికారత, యువత అభిరుచులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి అంశాలతో సందేశాత్మకంగా ఉందని కేటీఆర్ తెలిపారు. యువతకు ఉపయోగపడే చాలా విషయాలను సున్నితంగా చూపించారన్నారు. నిర్మాత సురేష్ బాబు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.

కాగా మంత్రి అభినందనల పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. మంచి కంటెంట్కు ప్రేక్షకాదరణ తప్పక ఉంటుందని 'పెళ్లిచూపులు' మరోసారి నిరూపించింది. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా త్వరలో మిలియన్ మార్క్ చేరనుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్ దేవరకొండ, రీతూ వర్మలు చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement