బికినీలో బెస్ట్‌గా కనిపించాలని... | Kriti Sanon to sport a bikini in Dinesh Vijan's next opposite Sushant Singh Rajput | Sakshi
Sakshi News home page

బికినీలో బెస్ట్‌గా కనిపించాలని...

Mar 27 2016 11:24 PM | Updated on Sep 3 2017 8:41 PM

బికినీలో బెస్ట్‌గా కనిపించాలని...

బికినీలో బెస్ట్‌గా కనిపించాలని...

వెండితెరపై కథానాయికలు చిట్టి పొట్టి దుస్తుల్లో, నిండైన చీరల్లో... ఎలా ప్రత్యక్షమైనా చూడ్డానికి పసందుగా ఉంటుంది.

వెండితెరపై కథానాయికలు చిట్టి పొట్టి దుస్తుల్లో, నిండైన చీరల్లో... ఎలా ప్రత్యక్షమైనా చూడ్డానికి పసందుగా ఉంటుంది. అందుకే హీరోలు లేకుండా సినిమాలు వస్తాయి కానీ, హీరోయిన్ లేని సినిమా దాదాపు ఉండదు. గ్లామర్‌కి అంత పవర్ ఉంటుంది మరి. కానీ, చిన్ని చిన్ని డ్రెస్సుల్లో కనిపించాలంటే ఖలేజా ఉండాలి. ఎందుకంటే, శరీరాకృతి బాగా లేకపోతే విమర్శలపాలు కావాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కృతీ సనన్ కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారట. విషయం ఏంటంటే.. ప్రస్తుతం నటిస్తున్న ‘రాబ్తా’ చిత్రంలో ఆమె బికినీలో దర్శనమివ్వనున్నారట. బికినీలో కనిపించడం అంటే ఓ సాహసమే.

ఎక్కడి కొలతలు అక్కడ కరెక్ట్‌గా ఉండాల్సిందే. ప్రస్తుతం ఆ కొలతల కోసమే ఆమె వర్కవుట్ చేస్తున్నారట. బికినీలో వీలైనంత బెస్ట్‌గా కనిపించాలనే పట్టుదలతో ఉన్నారని బాలీవుడ్ టాక్. మామూలుగానే కృతి శరీరాకృతి బాగుంటుంది. బికినీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయితే కత్తిలా ఉంటారని చెప్పొచ్చు. ఈ తరం నాయికల్లో కరీనా కపూర్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి వాళ్లు బికినీల్లో దర్శనమిచ్చి భేష్ అనిపించుకున్నారు. కృతీ సనన్ కూడా కితాబులు కొట్టేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆమె కసరత్తుల గురించి తెలిసినవాళ్లు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement