డబుల్‌ ధమాకా | Koneru Satyanarayana announces two new films on his birthday | Sakshi
Sakshi News home page

డబుల్‌ ధమాకా

Oct 21 2018 12:54 AM | Updated on Oct 21 2018 12:54 AM

Koneru Satyanarayana announces two new films on his birthday - Sakshi

కోనేరు సత్యనారాయణ , రమేశ్‌ వర్మ

రమేశ్‌ వర్మ నిర్మాణ సారథ్యంలో ఏ స్టూడియోస్‌ పతాకంపై కె.ఎల్‌. యూనీవర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణ ‘ఏరువాక, 16 ఫ్లస్‌’ చిత్రాలను నిర్మిస్తున్నట్లు తన పుట్టినరోజు (అక్టోబర్‌ 20) సందర్భంగా వెల్లడించారు. ‘‘రామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న క్యూట్‌ లవ్‌స్టోరీ ‘ఏరువాక’. రెండు యువ జంటల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. రమేశ్‌ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్‌ కె. నాయుడు కెమెరామేన్‌.

యుక్తవయసులో ఉన్న ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి చేసే ఓ ప్రయాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘16 ఫ్లస్‌’. రమేశ్‌ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాకు సాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలకూ చేతన్‌ భరద్వాజ్‌ స్వరకర్త. ఇవి కాకుండా ఇద్దరు స్టార్‌ హీరోలతో చేయబోయే సినిమాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు కోనేరు సత్యనారాయణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement