వరుస సీక్వెల్స్‌కు కింగ్‌ రెడీ | King Nagarjun Busy With Three Sequels | Sakshi
Sakshi News home page

వరుస సీక్వెల్స్‌కు కింగ్‌ రెడీ

Mar 20 2019 10:42 AM | Updated on Jul 15 2019 9:21 PM

King Nagarjun Busy With Three Sequels - Sakshi

టాలీవుడ్ సీనియర్‌ హీరో కింగ్ నాగార్జున వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్‌ మూవీ బ్రహ్మాస్త్రలో నటిస్తున్నా నాగ్‌, త్వరలో మన్మథుడు 2లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు చిలసౌ ఫేం రాహుల్‌ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా తరువాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కనున్న  బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించేందుకు ఓకె చెప్పాడట.

ఈ సినిమాలో బంగార్రాజు పాత్రలో నాగ్‌ నటించనుండగా ఆయన మనవడిగా నాగచైతన్య కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజుగాది గది సీక్వెల్‌ కూడా తెర మీదకు వచ్చింది. రాజు గారి గది 2లో ఇంట్రస్టింగ్ రోల్‌లో కనిపించిన నాగ్, ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రాజుగారి గది 3లో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలా వరుసగా సీక్వెల్‌ సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు కింగ్‌ నాగార్జున.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement