దుమ్మురేపుతున్న చిరు టీజర్‌ | Khaidi No 150 Official Teaser out | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న చిరు టీజర్‌

Dec 8 2016 6:37 PM | Updated on Sep 4 2017 10:14 PM

దుమ్మురేపుతున్న చిరు టీజర్‌

దుమ్మురేపుతున్న చిరు టీజర్‌

తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా సందడి మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన తన సొంత సినిమాలో సొంత గొంతుతో ప్రేక్షకులను పలకరించారు.

హైదరాబాద్‌: తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన మెగాస్టార్‌ చిరంజీవి సినిమా సందడి మొదలైంది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన తన సొంత సినిమాలో సొంత గొంతుతో ప్రేక్షకులను పలకరించారు. విలన్ల దుమ్ముదులిపారు. గట్టి పంచ్‌ డైలాగ్‌ పేల్చారు. అదే స్టైల్‌తో, అదే నడకతో మెగాస్టార్‌ మెరుపు మరింత రెట్టింపయిందనుకునేలా చేశారు. ఆయన నటిస్తున్న ఖైదీ నంబర్‌ 150 చిత్ర టీజర్‌ విడుదలైంది. ఫస్ట్‌లుక్‌తోనే అభిమానుల ఆశలు చిగురింపజేసిన ఆయన ఈ టీజర్‌తో చిత్రంపై మరోసారి అంచనాలు అమాంతం పెంచేశారు.

తన దూకుడు తగ్గలేదనిపించారు. అదిరిపోయే నేపథ్య సంగీతం, పోరాట దృశ్యంతో ప్రారంభమైన ఈ టీజర్‌ విలన్‌కు ఓ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇవ్వడం ద్వారా ముగిసింది. ‘ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా.. నచ్చితేనే చూస్తా..కాదని బలవంతం చేస్తే.. కోస్తా.. ఏ స్వీట్‌ వార్నింగ్‌’ అని పంచ్‌ డైలాగ్‌ కొట్టి ఎంతో స్టైలిష్‌గా కళ్లజోడు పెట్టుకుంటూ చిరంజీవి ముందుకెళుతూ.. దటీజ్‌ మెగాస్టార్‌ అనుకునేలా కనిపించారు. ఈ టీజర్‌ లో ఆయన మాష్టారు సినిమాలో ఉన్నంత ఫ్రెష్‌ లుక్‌ తో కనిపించారు.   

Advertisement
 
Advertisement
Advertisement