మెగాస్టార్ లుక్కు మెగా రెస్పాన్స్ | Khaidi No 150 first look gets a roaring response | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ లుక్కు మెగా రెస్పాన్స్

Oct 29 2016 2:43 PM | Updated on Sep 4 2017 6:41 PM

మెగాస్టార్ లుక్కు మెగా రెస్పాన్స్

మెగాస్టార్ లుక్కు మెగా రెస్పాన్స్

రిలీజ్ అయిన నిమిషాల్లోనే మెగాస్టార్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా హీరోలు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మార్క్ కామెంట్ తో...

రిలీజ్ అయిన నిమిషాల్లోనే మెగాస్టార్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా హీరోలు తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోగా.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  తన మార్క్ కామెంట్ తో మెగా అభిమానులను ఖుషీ చేశాడు. 'నేను ఏడేళ్ల క్రితం చూసిన చిరంజీవి కన్నా.. ఈ లుక్ లో చిరు వయసు ఏడేళ్లు తక్కువగా కనిపిస్తోంది' అంటూ కామెంట్ చేశాడు.

వరుణ్ తేజ్, రామ్ చరణ్ లు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులను మరింతగా హుషారెత్తిస్తున్నారు. బాలీవుడ్ ట్రెడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ పేజ్ లో మెగా లుక్ ను పోస్ట్ చేశారు. ఇప్పటికే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఖైదీ నంబర్ 150 ప్రస్తుతం సాంగ్స్ షూట్ లో బిజీగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement