తెలుగులో తొలిసారి

Keerthi Suresh next telugu fulm is sports romedy with Aadhi, Jagapathi babu - Sakshi

‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘ఇక్బాల్‌’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరున్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు ప్రముఖ దర్శకుడు నగేశ్‌ కుకునూర్‌. దాదాపు 20 ఏళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైన ఈ హైదరాబాదీ తెలుగులో మొదటిసారి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్‌ రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వికారా బాద్, పూణేల్లో షూటింగ్‌ జరుగుతోంది. ఇంకా టైటిల్‌ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 2019లో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వర్త్‌ ఏ షార్ట్‌ మోషన్‌ పోస్టర్‌ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్‌ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ డిజైనర్‌ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ. శివప్రకాశ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, ‘తను వెడ్స్‌ మను’ ఫేమ్‌ చిరంతన్‌ దాస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్‌ గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేస్తున్న ఈ చిత్రంలో రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top