
‘కరిష్మా హ్యాండ్ బ్యాగ్ ధర వింటే షాక్’
ముంబై : బాలీవుడ్ భామలు తమ హోదాను చాటేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. డ్రెస్‌లు, యాక్సెసరీలకు లక్షలకు లక్షలు వెచ్చించడంలో ముందుండేందుకు వారు పోటీపడతారు. తాజాగా కరిష్మా కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌తో సందడి చేశారు.
బ్లాక్ కలర్ టాప్, బాటమ్‌లతో పాటు అదే రంగు షూస్‌తో ఆమె అందరినీ ఆకట్టుకున్నారు. ఇక కరిష్మా ధరించిన టాన్ బిర్కిన్ బ్యాగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ బ్యాగ్ ధర 15,000 యూఎస్ డాలర్లు కాగా, మన కరెన్సీలో రూ 10 లక్షల పైమాటే.