బాలీవుడ్లో ఊపిరి | Karan Johar buys the Hindi remake rights of Oopiri | Sakshi
Sakshi News home page

బాలీవుడ్లో ఊపిరి

Mar 30 2016 11:35 AM | Updated on Jul 15 2019 9:21 PM

బాలీవుడ్లో ఊపిరి - Sakshi

బాలీవుడ్లో ఊపిరి

కింగ్ నాగార్జున, తమిళ యంగ్ హీరో కార్తీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా ఊపిరి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం...

కింగ్ నాగార్జున, తమిళ యంగ్ హీరో కార్తీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా ఊపిరి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ ఫిలిం 'ద ఇంటచబుల్స్'కు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవటంతో ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఊపిరి రీమేక్ రైట్స్ను సొంతం చేసుకున్నట్టు సమాచారం.

పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఊపిరి సినిమా బాలీవుడ్లో రీమేక్ అవుతుండటంపై హీరో నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. ఊపిరి బాలీవుడ్ రీమేక్లో నటిస్తారా అన్న ప్రశ్నకు.., అది కరణ్ ఇష్టం, ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నటించానని, ఈ పాత్ర తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు నాగ్. మరి కరణ్ జోహర్ ఈ సినిమాలో నాగ్ చేసిన పాత్రకు ఏ స్టార్ హీరోను ఒప్పిస్తాడో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement