షోలో కుప్పకూలిన స్టార్ కమెడియన్ | Kapil Sharma faints and episode getting cancelled | Sakshi
Sakshi News home page

షోలో కుప్పకూలిన స్టార్ కమెడియన్

Jul 9 2017 11:25 AM | Updated on Sep 5 2017 3:38 PM

షోలో కుప్పకూలిన స్టార్ కమెడియన్

షోలో కుప్పకూలిన స్టార్ కమెడియన్

ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ తాను నిర్వహిస్తున్న షోలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ముంబయి: ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ తాను నిర్వహిస్తున్న షోలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇటీవల జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం కపిల్ ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈవెంట్లలో పాల్గొనేందుకు కపిల్ సిద్ధమవుతున్నారు. ఒత్తిడి కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. కపిల్ షో రద్దు కావడం ఇది తొలిసారేం కాదు. ఓసారి లండన్‌లో పరేశ్ రావల్, కార్తీక్ అర్యాన్, కృతి కర్బందా సెట్లో రెడీగా ఉన్న సందర్బంలో షో నిర్వాహకుడు కపిల్ శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒత్తిడిలో ఉన్న కపిల్ అధిక రక్తపోటు, షుగర్‌ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు చెప్పారు.

అసలేం జరిగింది?
బాలీవుడ్‌ బాద్‌షా 'కింగ్' షారుక్‌ ఖాన్‌, అనుష్క శర్మ నటించిన లేటెస్ట్ మూవీ 'జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌'. ఈ మూవీ ప్రమోషన్ కోసం హీరోహీరోయిన్లు కపిల్ శర్మ షోకు రావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం ఈవెంట్‌కు హాజరయ్యారు. సరిగ్గా కాసేపట్లో షో మొదలవుతుందనగా కపిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. షో సహ నిర్వాహకులు, సిబ్బంది చికిత్స నిమిత్తం కపిల్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. షో రద్దు కావడంతో షారుఖ్, అనుష్కలు తిరిగి వెళ్లిపోయారు. టీఆర్‌పీ రేటింగ్స్ కోసం అధిక ఒత్తిడికి లోను కావడమే కపిల్ అనారోగ్యానికి కారణమై ఉంటుందని భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement