మనోభావాలు కించపర్చలేదు: కమల్‌హాసన్‌ | Kamalhasan response to case against Bigboss show | Sakshi
Sakshi News home page

మనోభావాలు కించపర్చలేదు: కమల్‌హాసన్‌

Jul 12 2017 10:00 PM | Updated on Jun 18 2018 8:04 PM

మనోభావాలు కించపర్చలేదు: కమల్‌హాసన్‌ - Sakshi

మనోభావాలు కించపర్చలేదు: కమల్‌హాసన్‌

బిగ్‌బాస్‌ షో కారణంగా తమిళ సంస్కృతికి భంగం కలగలేదని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు.

బిగ్‌బాస్‌ షో కారణంగా తమిళ సంస్కృతికి భంగం కలగలేదని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఆయన హోస్ట్‌ చేస్తున్న సెలబ్రెటీ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌'పై వివాదం తలెత్తడంపై ఆయన బుధవారం స్పందించారు. బిగ్‌బాస్‌ షో ఎవరి మనోభావాలను కించపరచదని చెప్పారు. తమిళ భాష తెలియని వారికి నేర్పడం తప్పుకాదని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అవినీతి ఉందని, దాన్ని రూపుమాపడానికి ఎవరో ఒకరు రావాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అన్నమాటలను ప్రస్తావించారు. ఆ మాటలను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వెజ్‌, నాన్‌ వెజ్‌ ఎవరి అలవాట్లు వారివని వాటిపై నిబంధనలు, ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. కాగా, షో పేరిట తమిళ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ హెచ్‌ఎంకే (హిందూ మక్కల్‌ కట్చి) సంఘం సెక్రటరీ శివ.. చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు కమల్‌హాసన్‌, షో నిర్వాహకులపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement