భారతీయుడు మళ్లీ వస్తాడు

kamal and sankar ready to bharateeyudu 2

‘భారతీయుడు’ మళ్లీ వస్తున్నాడు. అయితే... ఎలాంటి కథతో వస్తున్నాడనేది ఇక్కడ హాట్‌ టాపిక్‌. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన తమిళ సిన్మా ‘ఇండియన్‌’కి తెలుగు వెర్షనే ‘భారతీయుడు’. 1996లో వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, తన కన్న కొడుకునే చంపిన కథతో వచ్చిన ఆ సినిమా క్లాసిక్‌గా నిలిచింది. దానికి సీక్వెల్‌ తీయాలని చాలారోజుల నుంచి ఇటు హీరో కమల్, అటు దర్శకుడు శంకర్‌ ప్రయత్నిస్తున్నారు.

ఇన్నాళ్లకు కుదిరింది. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఈ సీక్వెల్‌ (ఇండియన్‌–2)ను ప్రముఖ తెలుగు నిర్మాత ‘దిల్‌’ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థపై నిర్మించనున్నారు. ‘‘ఉన్నత సాంకేతిక విలువలతో, సమకాలిన సామాజిక సమస్యతో తెలుగు–తమిళ భాషలతో పాటు ఇతర భాషల్లో ఈ సీక్వెల్‌ను రూపొందించబోతున్నాం. ‘భారతీ యుడు’ని మించేలా ఉంటుందీ సినిమా. రజనీకాంత్‌ ‘2.0’ పూర్తయిన వెంటనే ఈ  సిన్మా మొదలవుతుంది. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top