ఎంత మంచివాడో

Kalyan Ram new film on Enta Manchivadavura - Sakshi

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని ‘ఎంత మంచి వాడవురా.. ఎన్ని నోళ్ల పొగడుదురా...’ పాట ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. 1960లో విడుదలైన ఆ సినిమా పాట ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘ఎంత మంచి వాడవురా’ టైటిల్‌ ఖరారు చేశారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ టీజర్‌ని రిలీజ్‌ చేశారు. మెహరీన్‌ కథానాయిక నటిస్తున్నారు. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ఉమేష్‌ గుప్తా సమర్పణలో ఆదిత్య మ్యూజిక్, శ్రీదేవి మూవీస్‌ పతాకాలపై సుభాష్‌ గుప్త, శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ– ‘‘మా హీరో కల్యాణ్‌రామ్‌ స్వతహాగా మంచి మనిషి. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా ఆ విషయాన్నే ప్రతిబింబిస్తుంది. అందుకే ‘ఎంత మంచి వాడవురా’ టైటిల్‌ ఖరారు చేశాం. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఊటీలో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’అన్నారు. ‘‘మా కథకు సరిపోయే టైటిల్‌ ఇది. దీన్నిబట్టే హీరో పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు సతీష్‌ వేగేశ్న.  వి.కె.నరేశ్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్‌ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్‌ తోట, సంగీతం: గోపీ సుందర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top