మహానటుడు కమల్‌హాసన్ సరసన నటించాలని కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కాజల్ మాత్రం అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుంది.
మహానటుడు కమల్‌హాసన్ సరసన నటించాలని కథానాయికలందరూ ఉవ్విళ్లూరుతూ ఉంటారు. కానీ కాజల్ మాత్రం అంతటి అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుంది. డేట్స్ సర్దుబాటు చేయలేకే ఆ అవకాశాన్ని చేజార్చుకున్నానని కాజల్ వివరణ ఇచ్చుకున్నారు కూడా. అయితే... ఉన్నట్లుండి డైరీ ఖాళీ అయ్యిందో ఏమో... కమల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కాజల్. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఉత్తమ విలన్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. 

