ఒకే వేదికపై కేసీఆర్, చిరు, జాకీచాన్! | K.Chandrasekhar, Chiranjeevi, Jackie Chan on one stage? | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై కేసీఆర్, చిరు, జాకీచాన్!

Sep 28 2014 8:37 PM | Updated on Aug 15 2018 7:50 PM

ఒకే వేదికపై కేసీఆర్, చిరు, జాకీచాన్! - Sakshi

ఒకే వేదికపై కేసీఆర్, చిరు, జాకీచాన్!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, యాక్షన్ హీరో జాకీచాన్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మెగాస్టార్ చిరంజీవి, యాక్షన్ హీరో జాకీచాన్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? కన్నులపండువగా ఉంటుంది కదూ! ఈ అరుదైన సన్నివేశాన్ని త్వరలో  చూడవచ్చు. విశ్వసనీయ సమాచారం మేరకు అంతర్జాతీయ స్టార్ హీరో జాకీచాన్ హైదరాబాద్ రానున్నారు.

తమిళ సంచలన దర్శకుడు శంకర్ తాజా సినిమా 'ఐ' తెలుగు ఆడియో వేడుకలో జాకీచాన్ పాల్గొననున్నారు. కేసీఆర్, చిరులతో కలసి జాకీచాన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ చిత్ర నిర్మాత ఈ ముగ్గురికి ఆహ్వానం పంపినట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. జాకీచాన్ రెండు రోజుల్లో ఓకే చెప్పవచ్చని తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ఈ వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐ సినిమాలో విక్రమ్, అమీ జాక్సన్ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement