‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్ అదుర్స్ | Jyo Achyutananda US box office collection | Sakshi
Sakshi News home page

‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్ అదుర్స్

Sep 12 2016 9:42 AM | Updated on Apr 4 2019 5:12 PM

‘జ్యో అచ్యుతానంద’  కలెక్షన్స్ అదుర్స్ - Sakshi

‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్ అదుర్స్

‘జ్యో అచ్యుతానంద’ సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతోంది.

‘జ్యో అచ్యుతానంద’  సినిమా అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల దిశగా దూసుకెళుతోంది. మొదటి మూడు రోజుల్లోనే కలెక్షన్లు కోటిన్నర రూపాయలు దాటేశాయి. ఈనెల 8న విడుదలైన ఈ సినిమా అమెరికాలో మొదటి మూడు రోజుల్లో రూ. 1.82 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు సినీ విమర్శకుడు, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.  గురువారం 30,864, శుక్రవారం 90,539, శనివారం 149,927 డాలర్లు వసూలు చేసినట్టు తెలిపారు. ఆదివారం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించారు. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ తో విడుదలైన ‘జ్యో అచ్యుతానంద’కు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి స్పందన వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement