జోరుమీదున్న ఎన్టీఆర్

జోరుమీదున్న ఎన్టీఆర్


తారక్‌ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘ఆది’. ఆ సినిమాతో బెల్లంకొండ సురేష్ కూడా స్టార్ నిర్మాతఅయిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతుండటం విశేషం. ‘కందిరీగ’ లాంటి వినోదభరిత చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతోంది. ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా  శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. తారక్‌ని ఎలా చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారో ఇందులో ఆయన పాత్ర చిత్రణ అలా ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం.

 

‘అత్తారింటికి దారేది’ లాంటి సంచలన విజయం సాధించిన చిత్రంలో నటించిన సమంత, ప్రణీత ఇందులో ఎన్టీఆర్‌తో జతకట్టడం మరో విశేషం. ఈ సినిమాకు ‘రభస’ అనే టైటిల్ మొన్నటిదాకా ప్రచారంలో ఉంది. అయితే... ఆ టైటిల్ కరెక్ట్ కాదని, చిత్రం యూనిట్ సభ్యులు అంటున్నారు. ‘జోరు’ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదల కావచ్చని సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top