ఎన్టీఆర్‌ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన ట్రైనర్‌ | Jr Ntr Personal Trainer Lloyd Stevens Clarity About New Look | Sakshi
Sakshi News home page

Dec 5 2018 1:21 PM | Updated on Jul 14 2019 4:05 PM

Jr Ntr Personal Trainer Lloyd Stevens Clarity About New Look - Sakshi

టాలీవుడ్‌లో బిగెస్ట్‌ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతుంది. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ లో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఎన్టీఆర్‌ భారీకాయంతో కనిపించనున్నాడని అందుకోసం ఇప్పటికే వంద కేజీలకు పైగా బరువు పెరిగాడని ప్రచారం జరిగింది. అంతేకాదు ఎన్టీఆర్‌ లావుగా కనిపిస్తున్న ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అయితే  ఈవార్తలపై స్పందించిన ఎన్టీఆర్‌ పర్సనల్‌ ఫిజికల్ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌. ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ లుక్‌ అది కాదని, ప్రస్తుతం సొషల్ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న ఫోటోలు ఏడాది క్రితంవని క్లారిటీ ఇచ్చారు.

బాహుబలి తరువాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌కథ అందిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈసినిమా పిరియాడికల్‌ జానర్‌లో తెరకెక్కుతుందన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement