తగని ప్రశ్న తగిన జవాబు | Jhanvi Kapoor: For Me, Acting is Not a Job its a Lifestyle | Sakshi
Sakshi News home page

తగని ప్రశ్న తగిన జవాబు

Jul 26 2018 12:14 AM | Updated on Apr 3 2019 6:34 PM

Jhanvi Kapoor: For Me, Acting is Not a Job its a Lifestyle - Sakshi

ప్రశ్న: ‘ధడక్‌’ హిట్‌ అయింది. శ్రీదేవి నం.2 అనిపించుకోవాలని ట్రై చేసినట్లున్నారు?!


జాహ్నవి : మీకు నేను శ్రీదేవి నం.2 గా అనిపించవచ్చు. కానీ అమ్మ నన్ను.. జాహ్నవి నం.1 గా నిలబడాలని కోరుకున్నారు. చనిపోవడానికి ముందే అమ్మ ఈ సినిమాలో నేను నటించిన కొన్ని సన్నివేశాలను చూశారు. బాగుందని చెప్పలేదు. బాగోలేదనీ చెప్పలేదు. ‘మనిద్దర్నీ ప్రేక్షకులు పోల్చి చూసుకోకూడని విధంగా నీ నటన ఉండాలి’ అని అమ్మ నాతో అన్నారు. మంచి నటిగా కన్నా, మంచి మనిషిగా ఎదగాలని మరీ చిన్నప్పుడు అమ్మ నాతో చెబుతుండేవారు. అందరితో విధేయంగా ఉండాలనీ, సమయాన్ని పాటించాలని చెప్పేవారు.

ధడక్‌ షూటింగ్‌ మొదలైనప్పుడు కూడా అమ్మ ఇదే చెప్పారు. ఎలా నటించాలని మాత్రం చెప్పలేదు. అందుకే నేను జాహ్నవిలా నటించాను తప్ప, అమ్మను ఇమిటేట్‌ చెయ్యాలని ప్రయత్నించలేదు.‘ధడక్‌’ చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో ఆ సంతోషంలో శ్రీదేవి కూతురు జాహ్నవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ‘బిహైండ్‌ ది సీన్‌’ ఫొటోలలో ఇది ఒకటి. జాహ్నవి మేకప్‌లో లేనప్పుడు తీయించుకున్న ఈ ఫొటో శ్రీదేవి అభిమానులందరికీ విపరీతంగా నచ్చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement