
'జవాన్' కొత్త లుక్ విడుదల
‘జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా’.. అంటూ సాయి ధరమ్ తేజ్ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.
‘జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా’.. అంటూ సాయి ధరమ్ తేజ్ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తన లేటెస్ట్ మూవీ ‘జవాన్’ సరికొత్త పోస్టర్‌ను మంగళవారం ఆయన రిలీజ్ చేశారు. దేశం కోసం పిడికిలి బిగించి.. జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా అంటూ రెపరెపలాడేలాడే మన జాతీయ జెండాకు సలాం చేస్తున్న ‘జవాన్’ పోస్టర్ ప్రతి పౌరుడిలో దేశ భక్తిని రగిల్చేదిగా ఉంది.
'కొంతమంది మనుషులు కలిస్తే కటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశం భక్తి అంటే కిరీటం కాదు.. కృతజ్ఞత' అంటూ ఇటీవల ‘జవాన్’ టీజర్‌తో ఆకట్టుకున్న సాయిధరమ్ తేజ్ మరోసారి ‘జవాన్’ పోస్టర్‌తో మూవీపై అంచనాలు పెంచేశారు. ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి డైరెక్షన్‌లో దేశం కోసం ఏం చేయడానికైనా తెగించే యువకుడి క్యారెక్టర్‌లో సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు.
జెండా మనలో ధైర్యము రా..
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 15 August 2017
జయమే దానికి ధ్యేయము రా..
Team #Jawaan #happyindependenceday pic.twitter.com/qr8lbdcAQp