‘మహానటి’ రాక కోసం ఎదురుచూస్తున్నా’

Janhvi Kapoor Welcomes Keerthy Suresh To Bollywood - Sakshi

హీరోయిన్‌ కీర్తిసురేశ్‌కు ప్రశంసలు కొత్త కాదు. రెమో, రజనీమురుగన్, భైరవా, సండైకోళి, సామీ స్క్వేర్, సర్కార్‌ ఇలా మాస్‌ మసాలా చిత్రాల్లో నటించిన రాని పేరు ఒక్క మహానటితో తెచ్చుకుంది కీర్తి. అంతగా ఆ మహానటి (సావిత్రి) పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రంతో ఎందరి నుంచో ప్రశంసలు అందుకున్నారు.  అయితే మహానటిని మెచ్చుకునేవారి జాబితాలోకి తాజాగా మరొకరు చేరారు. దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ తన సోషల్‌ మీడియాలో కీర్తిపై ప్రశంసలు కురిపించింది. ‘మహానటి సినిమాలో మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీకు ఫిదా అయిపోయాను. మా నాన్న నిర్మిస్తున్న చిత్రంలో మీరు నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, ఆత్రుతగా ఉంది. బాలీవుడ్‌కు స్వాగతం అని క్యాప్షన్‌తో ఫోటో పోస్టు చేసింది జాన్వీ.

తాజాగా కీర్తికి బాలీవుడ్‌ అవకాశం వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో నటుడు అజయ్‌దేవ్‌గన్‌తో నటించడానికి రెడీ అవుతోంది. ఇది బయోపిక్‌ చిత్రం కావడం విశేషం. ప్రముఖ భారతీయ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, శిక్షకుడు సయ్యద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ జీవిత చరిత్రతో అమిత్‌శర్మ తెరకెక్కించనున్న చిత్రం ఇది. ఇందులో అజయ్‌కు జోడిగా నటిస్తుంది కీర్తి. ఈ చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ పాత్రలో నటించనుండగా ఆయనకు భార్యగా నటి కీర్తిసురేశ్‌ తెరపై కనిపించనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top