కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’ | Janatha Garage box office collection: Jr NTR, Mohanlal-starrer is having a terrific run | Sakshi
Sakshi News home page

కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’

Sep 4 2016 11:19 AM | Updated on Sep 4 2017 12:18 PM

కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’

కాసుల వర్షం కురిపిస్తున్న ‘జనతా గ్యారేజ్’

ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’  బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ ను దాటేసింది. కొరటాల శివ దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించింది. కబాలి(రూ.87.5 కోట్లు), బాహుబలి(రూ.73 కోట్లు) తర్వాత అత్యధిక ఓపెన్సింగ్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలియింది.

గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జనతా గ్యారేజ్’  తొలి రోజే రూ. 41 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21 కోట్లు వసూలు చేసింది. అమెరికాలో తొలి మూడు రోజుల్లో రూ. 6.34 కోట్లు కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. రూ. 40 కోట్ల వ్యయంతో ఈ సినిమా తెరకెక్కినట్టు సమాచారం. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. లాంగ్ వీకెండ్ ఉండటం వరుసగా సెలవులు కూడా రావటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement