లవ్ ఇన్ మలేసియా | Jai akash in the movie Love in Malaysia | Sakshi
Sakshi News home page

లవ్ ఇన్ మలేసియా

Aug 27 2013 12:49 AM | Updated on Sep 1 2017 10:08 PM

లవ్ ఇన్ మలేసియా

లవ్ ఇన్ మలేసియా

‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ తన పేరుని జై ఆకాష్‌గా మార్చుకున్నారు. అటు హీరోగానూ, ఇటు దర్శకునిగానూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా ‘లవ్ ఇన్ మలేసియా’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు.

‘ఆనందం’ ఫేమ్ ఆకాష్ తన పేరుని జై ఆకాష్‌గా మార్చుకున్నారు. అటు హీరోగానూ, ఇటు దర్శకునిగానూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా ‘లవ్ ఇన్ మలేసియా’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో రమ్య, జెన్నిఫర్, సందీప్తి కథానాయికలు.
 
 సిరి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై గణేష్ దొండి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇది పూర్తి స్థాయి విభిన్న చిత్రమని ఆకాష్ పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ వారంలో మలేసియాలో చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. 20 రోజులు అక్కడే షెడ్యూలు చేస్తాం. 
 
 రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. హిందీలో ఓ ప్రముఖ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సుమన్ జూపూడి. పాటలు: ధీరజ అప్పాజీ, మాటలు: అశోక్ వడ్లమూడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement