పొలం ప‌నుల్లో బిజీగా ఉన్న న‌టుడు | Jackie Shroff Happy With Best Fresh Air In Farmhouse | Sakshi
Sakshi News home page

ఫార్మ్ హౌస్‌లో ఇరుక్కుపోయిన న‌టుడు

Apr 13 2020 11:01 AM | Updated on Apr 13 2020 11:06 AM

Jackie Shroff Happy With Best Fresh Air In Farmhouse - Sakshi

లాక్‌డౌన్ వ‌ల్ల షూటింగ్‌లు, లొకేష‌న్‌లు అంటూ హ‌డావుడిగా తిరిగే సినిమావాళ్ల‌కు బోలెడంత ఖాళీ స‌మ‌యం దొరికింది. అయితే చాలామంది ఇంటిప‌ని, వంట‌ప‌ని చేస్తూ వాటి ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే ఓ బాలీవుడ్‌ నటుడు మాత్రం అవ‌న్నీ కాదు కానీ అంటూ రైతు అవ‌తారం ఎత్తాడు. న‌టుడు జాకీష్రాఫ్ త‌న ఫార్మ్‌హౌస్‌లో ఉన్న స‌మ‌యంలోనే లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. దీంతో జాకీ అక్క‌డే చిక్కుకుపో‌గా అత‌ని కుటుంబం మాత్రం ముంబైలో ఉంది. అయితే కుటుంబ‌స‌భ్యుల‌తో నిరంత‌రం ట‌చ్‌లోనే ఉంటున్నారీ న‌టుడు. (కరోనా: పాజిటివ్‌ వార్తను చెప్పిన హీరో)

ఈ సంద‌ర్భంగా ఆయ‌న భార్య ఐశా..  జాకీ అక్క‌డ ఏం చేస్తున్నార‌న్న విష‌యాల‌ను వెల్ల‌డించింది. ఒక్క‌డే ఉంటున్నందుకు ఏమాత్రం బోర్ ఫీల్ అవ‌ట్లేద‌ని తెలిపింది. పొలంలోని మొక్క‌లే అత‌నికి మంచి కంపెనీ ఇస్తున్నాయ‌ని చెప్పుకొచ్చింది. ప్రకృతి పైర గాలుల‌ను ఆనందంగా ఆస్వాదిస్తున్నాడ‌ని పేర్కొంది. కాగా జాకీ ష్రాఫ్‌కు మొక్క‌లంటే ఎంతో ఇష్టం. అత‌ని గార్డెన్‌లో సేంద్రీయ కూర‌గాయల‌తో పాటు పంట‌లు కూడా పండిస్తారు. విరివిగా మొక్క‌లు నాటాలంటూ అభిమానుల‌ను సైతం ప్రోత్స‌హించేవాడు. అంతేకాకుండా అత‌ని 25వ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కొంత భూమిని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే.

(నాన్నతో కలిసి నటించను: టైగర్‌ ష్రాఫ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement