జాకీ కూతురికి కష్టాలా?

Jackie Chan's estranged daughter Etta Ng says she's homeless - Sakshi

‘‘నాకు ఇల్లు లేదు’’ అంటున్నారు జాకీ చాన్‌ కూతురు ఎట్టా ఎన్జీ. మార్షల్‌ ఆర్ట్స్‌ స్టార్‌ జాకీ చాన్‌ కుమార్తెకు ఇల్లు లేకపోవటమేంటి? అనే సందేహం కలగవచ్చు. కానీ ఎట్టా ఎన్జీ జాకీ చాన్‌ సొంత కుమార్తె కాదు. హాంగ్‌కాంగ్‌ బ్యూటీ క్వీన్‌ ఎన్జీతో జాకీ ఎఫైర్‌ సాగించినప్పుడు కలిగిన సంతానమే ఎట్టా. ‘‘ప్రస్తుతం నేను ఉండటానికి ఇల్లు కూడా లేదు, కారణం మా పేరెంట్స్‌ బిహేవియరే’’ అని ఓ వీడియో అప్‌లోడ్‌ చేశారు ఎట్టా. ‘‘నేను జాకీచాన్‌ కూతుర్ని. నా గర్ల్‌ఫ్రెండ్‌ పేరు ఆండీ. నెల రోజులుగా మేం ఇల్లు లేకుండా ఉన్నాం.

బ్రిడ్జ్‌ల కింద పడుకున్నాం. మా పేరెంట్స్‌ ‘హోమోఫోబిక్‌’ బిహేవియర్‌ కారణంగానే మేం ఇల్లు లేనివాళ్లం అయ్యాం. మేం పోలీసుల దగ్గరకు, హాస్పిటల్స్, ఫుడ్‌ బ్యాంక్స్, ఎల్‌జీబీటి (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్‌) సెంటర్స్‌కు వెళ్లాం సహాయం కోసం. కేవలం మేమిద్దరం లెస్బియన్స్‌ (స్వలింగ సంపర్కులం) అనే కారణంగానే మాకెవరూ సహాయపడటంలేదు. ఈ కారణంగానే కన్నవాళ్లు కూడా దూరం పెట్టేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టా. అయితే విషయం ఏంటంటే.. జాకీచాన్‌కు ఒకప్పుడు ఎన్జీతో సంబంధం ఉన్నప్పటికీ  ఆమె ద్వారా కలిగిన ఎట్టాను ఆయన ఓన్‌ చేసుకోలేదనే టాక్‌ ఉంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top