డియర్‌ సోనూ... ఇది నీకోసం | Jackie Chan Surprises Sonu Sood | Sakshi
Sakshi News home page

డియర్‌ సోనూ... ఇది నీకోసం

Mar 22 2018 9:34 AM | Updated on Apr 3 2019 6:23 PM

Jackie Chan Surprises Sonu Sood - Sakshi

జాకీ చాన్‌, సోనూసూద్

ముంబై : బాలీవుడ్‌ నటుడు సోనూసూద్ ఫుల్‌ ఖుషీగా ఉన్నాడు.  ప్రత్యేక బహుమతితో పాటు ఆత్మీయ లేఖ అందుకోవడమే సోనూ ఆనందానికి కారణం. ఇంతకీ ఆ ఆత్మీయులు ఎవరంటే.. ఇంటర్నేషనల్‌ స్టార్‌ జాకీ చాన్‌. ఇండో- చైనీస్‌ భాగస్వామ్యంలో ‘కుంగ్‌ ఫూ యోగా’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో జాకీ చాన్‌, సోనూ సూద్‌ మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి జాకీ చాన్‌ సోనూ సూద్‌కు ఏదో ఒక బహుమతి ఇస్తూనే ఉన్నాడు. తాజాగా జేసీ స్టంట్‌ టీమ్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లెదర్‌ జాకెట్‌ను సోనూకి పంపించాడు. దానితో పాటు ఒక ఆత్మీయ లేఖ కూడా రాసి సర్‌ప్రైజ్‌ చేశాడు.

‘మై డియర్‌ సోనూ.. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న సోదరులతోపాటు అతి కొద్ది మంది ఆత్మీయులకు మాత్రమే ఈ కానుక ఇస్తున్నాను. ఇది చిన్న కానుకే అయి ఉండవచ్చు కానీ దీన్ని చూసిన ప్రతీసారీ నీకు నేను గుర్తొస్తాను. అప్పుడు నేను నీతోపాటుగా ఉన్నట్టే నువ్వు భావిస్తావు’ అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ జతచేశాడు.

ఇంటర్నేషనల్‌ సూపర్‌ స్టార్‌ నుంచి బహుమతులతో పాటు ఆత్మీయ లేఖలు కూడా అందుకోవటం ఎవరికైనా సంతోషమే కదా.. సోనూ సూద్‌ కూడా ఇపుడు ఆ ఫీల్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. గతంలో కూడా జాకీ చాన్‌ ‘అయామ్‌ జాకీచాన్‌: మై లైఫ్‌ ఇన్‌ యాక్షన్‌’ అనే బుక్‌తో పాటు, నీతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ లేఖ రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement