ట్రక్కుతో చిక్కు తప్పెన్‌

Jackie Chan and Team Rescued from Deadly Mudslide on Movie Set - Sakshi

చైనా యాక్షన్‌ సూపర్‌ స్టార్‌ జాకీ చాన్‌ అంటే యాక్షన్‌ సినిమా ప్రియులందరికీ ఇష్టమే. ఎందుకంటే ఎంతో రిస్కీ స్టంట్స్‌ని కూడా అవలీలగా స్క్రీన్‌ మీద చేసేస్తారు. కానీ స్క్రీన్‌ వెనక ఆ స్టంట్స్‌ కోసం ఎంత సాహసానికైనా రెడీ అంటారు. ఈ ప్రక్రియలో ఎన్నోసార్లు ఒళ్లు జల్లెడ అయిపోయేలా దెబ్బలు తగిలించుకొన్నారు. కొన్నిసార్లు ప్రాణం మీదకు కూడా తెచ్చుకున్నారు. ఆయన శరీరం మీదున్న ప్రాక్చర్స్‌ అయితే లెక్క లేనన్ని. తాజాగా ‘ప్రాజెక్ట్‌ ఎక్స్‌’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు జాకీ. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఫేమ్‌ జాన్‌ సేనా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈసారి కూడా ఓ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారట జాకీ చాన్‌.జాకీ మాత్రమే కాదు మొత్తం చిత్రబృందం  ‘మడ్‌స్లైడ్‌’ (మట్టి దానంతట అదే కుదించుకుపోయే ప్రకృతి వైపరీత్యం) నుంచి తప్పించుకున్నారట. ఈ విషయాన్ని జాకీ పంచుకుంటూ – ‘‘లొకేషన్‌లో షూటింగ్‌ చేస్తుండగా వాతావరణంలో మార్పు వచ్చేసి మట్టి కుదించుకుపోవడం స్టార్ట్‌ అయింది. మా ప్రొడక్షన్‌ ట్రక్కులన్నీ అందులో చిక్కుకుపోయాయి. మా టీమ్‌ అంతా భయపడిపోయాం. ఇంతలో పెద్ద ట్రక్‌ వచ్చి మమ్మల్ని కాపాడింది. వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనుభవం వల్ల మాకో పాఠం బోధపడింది. వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని తెలిసింది’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top