మా అబ్బాయి పేరేంటంటే...? | It's Riaan Riteish Deshmukh, Genelia announces son's name | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి పేరేంటంటే...?

Dec 7 2014 10:19 PM | Updated on Apr 3 2019 6:23 PM

మా అబ్బాయి పేరేంటంటే...? - Sakshi

మా అబ్బాయి పేరేంటంటే...?

బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ‘మా బుజ్జి కొండ రాక మాకెంతో ఆనందంగా ఉంది’

బాలీవుడ్ క్యూట్ కపుల్ రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ‘మా బుజ్జి కొండ రాక మాకెంతో ఆనందంగా ఉంది’ అని ఈ దంపతులు పేర్కొన్నారు. తమ కుమారుడి నామకరణోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ వేడుక గురించి జెనీలియా చెబుతూ - ‘‘ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల బంధువుల్నీ, స్నేహితుల్నీ కలుసుకోవడం అరుదైపోతోంది. కానీ, మా అబ్బాయి ‘బార్సీ’ (నామకరణోత్సవం) మమ్మల్నందర్నీ ఒకచోటకి చేర్చింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ వేడుక చేయడం చాలా ఆనందం అనిపించింది’’ అన్నారు. మా అబ్బాయి పేరేంటో తెలుసా. ‘రియాన్ రితేష్ దేశ్‌ముఖ్’ అని రితేష్, జెనీలియా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement