నటి రాధిక ఆఫీసులో ఐటీ సోదాలు | IT dept raids Radhika Sarathkumars Radaan Mediaworks | Sakshi
Sakshi News home page

నటి రాధిక ఆఫీసులో ఐటీ సోదాలు

Apr 11 2017 3:24 PM | Updated on Sep 27 2018 4:07 PM

నటి రాధిక ఆఫీసులో ఐటీ సోదాలు - Sakshi

నటి రాధిక ఆఫీసులో ఐటీ సోదాలు

ప్రముఖ సినీ నటి రాధికకు చెందిన ఆఫీసులో ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు చేపట్టింది. నటిగా సినిమాలు, టీవీ సీరియల్

ప్రముఖ సినీ నటి రాధికకు చెందిన ఆఫీసులో ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ సోదాలు చేపట్టింది. నటిగా సినిమాలు, టీవీ సీరియల్ చేస్తున్న రాధిక, తన సొంతం నిర్మాణ సంస్థ రాడన్ ద్వారా పలు సీరియల్లను సినిమాలను నిర్మిస్తోంది.  ఈ సంస్థ కు చెందిన టీ నగర్‌లోని కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు డబ్బు పంచుతున్నారన్న ఆరోపణల్లో..ఐటీ శాఖ ఇప్పటికే రాధిక భర్త శరత్‌కుమార్ ఇంటిపై దాడులు చేసిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న శరత్ కుమార్ ప్రస్తుతం శశికళ వర్గానికి మద్దతు పలుకుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement