ఇషా హోలీ వేడుకలు: హాజరైన బాలీవుడ్‌ స్టార్స్‌

Isha Ambani Holi Party: Bollywood Stars attended To Celebration - Sakshi

ప్రముఖ వ్యాపారవేత్త అంబానీ ఇంట్లో శుక్రవారం రాత్రి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖేష్‌ అంబానీ కూతురు ఇషా అంబానీ.. తన భర‍్త ఆనంద్‌ పిరమల్‌తో కలిసి ముంబైలో హోలీ పార్టీ ఏర్పాటు చేశారు ఈ వేడుకకు అంబానీ కుటుంబ సభ్యులు, పారిశ్రామిక వర్గానికి చెందిన ప్రముఖులతో పాటు బాలీవుడ్‌ తారలు హాజరైయ్యారు. భర్త నిక్‌ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, సోనాలి బింద్రే, హ్యూమా ఖురేషి తదితరులు పార్టీలో పాల్గొన్నారు. కాగా కత్రినా ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో ప్రియాంక దంపతులు, కత్రినా ఫోటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. (ప్రియాంక , నిక్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌)

రంగు నీళ్లలో తడుస్తూ.. ఒంటి నిండా రంగులు చల్లకుంటూ తారలంతా పార్టీలో ఎంజాయ్‌ చేశారు. ఈ సందర్భంగా తన జీవితంలో మొదటిసారి హోలీ వేడుకల్లో పాల్గొంటున్నట్లు నిక్‌ జోనాస్‌ తెలిపారు. ముఖం నిండా రంగులతో నిండిన ఇద్దరి ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘నా మొదటి హోలీ (అయిదు రోజుల ముందు.) ఇండియాలో నా రెండవ ముఖ్యమైన ఇంటిలో అత్యంత దగ్గర వ్యక్తులతో జరుపుకోవడం సరదాగా ఉంది.’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

She makes me smile a lot. #holi

A post shared by Nick Jonas (@nickjonas) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top