సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేశా | Interview With Raghu Karumanchi | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేశా

Dec 13 2015 6:03 PM | Updated on Sep 3 2017 1:57 PM

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేశా

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేశా

సినీ రంగంపై మక్కువతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేశానని హాస్య నటుడు కారుమంచి రఘు చెప్పారు.

కమెడియన్ రఘు
కొవ్వూరు : సినీ రంగంపై మక్కువతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేశానని హాస్య నటుడు కారుమంచి రఘు చెప్పారు. శనివారం కొవ్వూరులో జరిగిన ‘టైటానిక్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను పలకరించగా.. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చొరవతో ఆది సినిమా ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టానన్నారు. దర్శకుడు సురేంద్రరెడ్డి మంచి అవకాశాలు ఇచ్చారని, ప్రేక్షకుల ఆదరణతో హాస్య, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాని వివరించారు. ఇంకా ఏమన్నారంటే..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి సినిమా రంగంలోకి ఎందుకొచ్చానా అని ఎప్పుడైనా అనిపించిందా
ఎప్పుడు ఆ భావన రాలేదు. సినిమాల్లో అవకాశాలు పెరుగుతుండటం, ప్రేక్షకుల ఆదరణ సంతృప్తినిచ్చాయి.

ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు
150 తెలుగు సినిమాల్లో నటించా

సంతృప్తినిచ్చిన అంశం ఏమిటి
గత ఏడాది అత్యధికంగా 25 సినిమాల్లో నటించా. ఈ ఏడాది ఇప్పటికే 20 సినిమాలు చేశా.

ఇతర భాషా చిత్రాల్లో నటించారా. టీవీ సీరియల్స్ సంగతేంటి
తమిళం, బెంగాలీ భాషల్లో మూడేసి చిత్రాలు, కన్నడంలో రెండు, బోజ్‌పురిలో ఒక చిత్రంలో నటించాను. టీవీకి సంబంధించి వివిధ సీరియల్స్‌లో 1,500 ఎపిసోడ్స్‌లో నటించాను.

టైటానిక్ సినిమాలో మీ పాత్ర ఏమిటి
ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాను. అన్ని క్యారెక్టర్‌ల వారితో నటించే అవకాశం లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement