అంత మాట అనేస్తారా? | Ileana's 'Mu Barakan' is released on the 28th of this month | Sakshi
Sakshi News home page

అంత మాట అనేస్తారా?

Jul 24 2017 12:02 AM | Updated on Sep 5 2017 4:43 PM

అంత మాట అనేస్తారా?

అంత మాట అనేస్తారా?

బాలీవుడ్‌ మీడియాపై ఇలియానా కారాలు, మిరియాలు నూరేస్తున్నారు.

బాలీవుడ్‌ మీడియాపై ఇలియానా కారాలు, మిరియాలు నూరేస్తున్నారు. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా అంతంత మాటలు అనేస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా నటించిన ‘ము బారకాన్‌’ ఈ నెల 28న, ‘బాద్‌షాహో’ సెప్టెంబర్‌లో విడుదలవుతున్నాయి. ఈ రెండు తప్ప ఆమె చేతిలో మరో సినిమా లేదు.

అందువల్ల, సౌత్‌ సినిమాల్లో ఛాన్సుల కోసం ఇలియానా ప్రయత్నిస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిపై ఇలియానా స్పందిస్తూ ‘‘గతంలో ఏడాదిన్నర నేను ఖాళీగా ఉన్నప్పుడూ ఇలానే రాశారు. సౌత్‌లో నటించడం నాకిష్టమే. అక్కడ మంచి క్రేజీ కలర్‌ఫుల్‌ ఫిల్మ్స్‌ తీస్తారు. టైమ్‌ కుదరక నటించడం లేదంతే. హిందీలో ఛాన్సులు లేవని సౌత్‌లో ప్రయత్నిస్తున్నానని అనడం తప్పు. సౌత్‌లో కొందరు దర్శక–నిర్మాతలతో డిస్కషన్స్‌ చేసిన సినిమాలు వర్కౌట్‌ కాలేదు. ఛాన్స్‌ వస్తే మళ్లీ గ్లామర్‌ హీరోయిన్‌గా నటించడం నాకిష్టమే’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement