అలా కనిపించడానికి రెడీ! | Ileana Ready for Funny characters | Sakshi
Sakshi News home page

అలా కనిపించడానికి రెడీ!

Jun 10 2016 11:04 PM | Updated on Sep 4 2017 2:10 AM

అలా కనిపించడానికి రెడీ!

అలా కనిపించడానికి రెడీ!

హిందీ ‘బర్ఫీ’లో సీరియస్ రోల్‌లో కనిపించిన ఇలియానా ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో...

హిందీ ‘బర్ఫీ’లో సీరియస్ రోల్‌లో కనిపించిన ఇలియానా ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించాలనుకుంటున్నారు. ఎలాంటి పాత్ర అంటే.. ఆ పాత్ర తెరపై కనిపించగానే ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా ఉండాలట. ‘‘ఇలా చెబితే అర్థం కాదు కానీ, నా స్టైల్‌లో చెబుతా. అచ్చంగా తింగరబుచ్చిలా కనిపించాలనుకుంటున్నా’’ అని అసలు విషయం చెప్పారు ఇలియానా. ఇదేం కోరిక? అనే ప్రశ్న ఈ గోవా బ్యూటీ ముందుంచితే - ‘‘ఆ పాత్రలో చాలా ఫన్ ఉంటుంది. చేసేవాళ్లకూ బాగుంటుంది.

చూసేవాళ్లకూ పసందుగా ఉంటుంది. అలా సరదా సరదాగా ఉండే పాత్రలు చేసినప్పుడు తెలియకుండా ఓ కొత్త ఎనర్జీ వచ్చినట్లనిపిస్తుంది. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అందుకే నన్నెవరైనా తింగరబుచ్చిగా చూపించాలనిపిస్తే.. కనిపించడానికి నేను రెడీ’’ అంటున్నారు. తెలుగులో ఇలియానా ఫన్నీ క్యారెక్టర్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడామె హిందీలో కూడా అలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు కాబట్టి... హిందీ తెరపై ఇలియానాను ఆ టైపులో ఏ దర్శకుడు చూపిస్తాడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement