‘ఆ సినిమాలో నేను నటించడం లేదు’ | Iam not a part of Balakrishna Movie, says Regina Cassandra | Sakshi
Sakshi News home page

‘ఆ సినిమాలో నేను నటించడం లేదు’

Oct 17 2017 8:58 AM | Updated on Aug 29 2018 1:59 PM

Iam not a part of Balakrishna Movie, says Regina Cassandra  - Sakshi

బాలకృష్ణ హీరోగా తమిళ డైరెక్టర్‌ కేఎస్‌ రవికుమార్‌ దర‍్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రానికి సంబంధించి యువ కథానాయకి రెజీనా  క్లారిటీ ఇచ్చింది. ఆ చిత్రంలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు రెజీనా  ట్విట్‌ చేసింది. కాగా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే నయనతారతో పాటు, నటాషా దోషిని చిత్ర యూనిట్‌ ఫిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. అలాగే వారిద్దరితో పాటు రెజీనా పేరు కూడా నిన్న మొన్నటి వరకూ తెరమీదకు వచ్చింది. త్వరలోనే ఆమె సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ రెజీనా మాత్రం...తాను ఆ సినిమాలో నటించడంలేదని తెలిపింది. అలాగే చిత్ర యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement