నా భర్తను ప్రేమిస్తున్నా: హీరోయిన్ | I love my husband: Shilpa Shetty slams rumours of split with Raj Kundra | Sakshi
Sakshi News home page

నా భర్తను ప్రేమిస్తున్నా: హీరోయిన్

Jun 13 2016 9:02 AM | Updated on Sep 4 2017 2:23 AM

నా భర్తను ప్రేమిస్తున్నా: హీరోయిన్

నా భర్తను ప్రేమిస్తున్నా: హీరోయిన్

భర్తతో విడిపోనుందని వచ్చిన ఊహాగానాలపై బాలీవుడ్ హీరోయిన్ శిల్పా షెట్టి స్పందించింది.

తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయని, భర్తతో విడిపోనుందని వచ్చిన ఊహాగానాలపై బాలీవుడ్ హీరోయిన్ శిల్పా షెట్టి స్పందించింది. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్యోన్యంగా ఉంటున్నామని వెల్లడించింది. 'మేము విడిపోతున్నట్టుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి రూమర్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడం లేదు. వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నా'నని శిల్పా షెట్టి పేర్కొంది.

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై  సృష్టించిన వదంతులపై వివరణ ఇవాల్సిన అవసరం లేదని అంది. అయితే తాము విడిపోతున్నట్టు వచ్చిన వార్తలు చూసి విదేశాల్లో తమ కుటుంబ సభ్యులు ఆందోళనతో తమకు ఫోన్లు చేశారని వెల్లడించింది. వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వార్తలు రాసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని మీడియాకు చురక అంటించింది. తాము విడిపోవడం లేదని, తమపై వస్తున్నవి కేవలం వదంతులంటూ శిల్ప షెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా అంతకుముందు కొట్టి పారేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement