'సురక్షిత శృంగారంపై నమ్మకముంది' | I believe in safe sex: Sunny Leone | Sakshi
Sakshi News home page

'సురక్షిత శృంగారంపై నమ్మకముంది'

Jul 12 2016 10:53 AM | Updated on Sep 4 2017 4:42 AM

'సురక్షిత శృంగారంపై నమ్మకముంది'

'సురక్షిత శృంగారంపై నమ్మకముంది'

అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల బారిన పడకుండా కండోమ్ వాడాలని అభిమానులకు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సూచించింది.

ముంబై: అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల బారిన పడకుండా కండోమ్ వాడాలని అభిమానులకు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సూచించింది. కండోమ్ బ్రాండ్ కంపెనీకి ఆమె ప్రచారకర్తగా వ్యహరిస్తున్న ఆమె మాట్లాడుతూ.. 'సురక్షిత శృంగారం మంచిదని నేను నమ్ముతాను. లైంగిక వ్యాధుల బారిన పడకుండా ప్రజలను చైతన్య వంతులను చేయాల్సిన అవసరముంది. అందుకే కండోమ్ బ్రాండ్ లకు ప్రచారకర్తగా ఉన్నాన'ని వెల్లడించింది. పాపులర్ కండోమ్ బ్రాండ్ లకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.

అయితే అగ్ర కథానాయికలు ఎందుకు కండోమ్ ప్రకటనలు చేయడం లేదని ప్రశ్నించగా... 'ఇలాంటి అంశాల్లో ఎవరి ఇష్టం వారిది. వ్యక్తిగత లక్ష్యాలు ఆధారంగా తమ పని తాము చేసుకుపోతార'ని గడుసుగా సమాధానం ఇచ్చింది. సెలబ్రిటీ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ దబ్బూ రత్నాని రూపొందించిన బికినీ కేలండర్ ను సన్నీ లియోన్ ఆవిష్కరించింది. ఇందులో ఆమె ఫొటో కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement