జాకీచాన్‌తో హృతిక్‌

Hrithik Roshan Meets Jackie Chan In China - Sakshi

సినీ ప్రపంచంలో జాకీచాన్‌ తెలియని వారుండరు. యాక్షన్‌ చిత్రాలకు జాకీచాన్‌ ఫేమస్‌. కేవలం చైనాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు జాకీచాన్‌. ప్రస్తుతం ఈ సూపర్‌స్టార్‌ను హృతిక్‌ రోషన్‌ కలిసి కాసేపు ముచ్చటించాడు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చైనాకు వెళ్లిన హృతిక్‌ జాకీచాన్‌ను కలిశాడు.

హృతిక్‌ రోషన్‌, యామీ గౌతమ్‌ జంటగా వచ్చిన కాబిల్‌(తెలుగులో ‘బలం’) చిత్రాన్ని చైనాలో​ రిలీజ్‌ చేయనున్నారు. జూన్‌ 5న విడుదల కానున్న ఈ చిత్రానికి చిత్రయూనిట్‌ ప్రమోషన్స్‌ పెంచేసింది. ఇందులో భాగంగానే జాకీచాన్‌ను హృతిక్‌రోషన్‌ కలిశాడు. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఇండియన్‌ సినిమాలు దుమ్ములేపుతుండగా.. హృతిక్‌ నటించిన కాబిల్‌ ఏమేరకు రికార్డులను బ్రేక్‌ చేస్తుందో చూడాలి. 2017లో విడుదలైన ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top