బిగ్‌బాస్‌ హౌస్‌లో లోకనాయకుడు!

 Host Nani Welcomes To Tamil Host Kamal Haasan To Bigg Boss Telugu 2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిగ్‌బాస్‌ సీజన్‌-2 రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. గురువారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు రచ్ఛరంభోలా చేశారు. కెప్టెన్‌ టాస్క్‌లో భాగంగా జరిగిన డీజే టాస్క్‌లో చిందేసారు. అత్యంత ఆహ్లాదకరంగా.. ఆసక్తికరంగా సాగిన ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్‌లో ఇది ఓ బెస్ట్‌ ఎపిసోడ్‌గా చెప్పొచ్చు. హౌస్‌లోకి నూతన నాయుడు, శ్యామల సైతం రీఎంట్రీ ఇచ్చారు. వీరి రాకతో హౌస్‌ మేట్స్‌ రెట్టించిన ఉత్సాహం ప్రదర్శించారు. కెప్టెన్‌ పోటీదారులైన పూజా రామచంద్రన్‌, సామ్రాట్‌, రోల్‌రైడాలు డీజేలుగా వ్యవహరించగా.. వారికి మద్దతుగా ఇంటి సభ్యులు వారి ముందు డ్యాన్స్‌ చేశారు.

సరిసమానంగా సామ్రాట్‌, పూజా డీజేల మందు ఇంటి సభ్యులు డ్యాన్స్‌ చేయగా టై అయింది. మళ్లీ బిగ్‌బాస్‌ మరో సాంగ్‌ ప్లే చేయడంతో మేజారిటీ సభ్యులు పూజాకు మద్దతివ్వడంతో ఆమె తదుపరి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి సభ్యులు చిందేశారు. ముఖ్యంగా దీప్తి సునయన, శ్యామల, గీతా మాధురి, గణేశ్‌లు అదరగొట్టారు.. ఆఖరికి బాబుగోగినేని సైతం డ్యాన్స్‌ చేశాడు.

ఇక ఎపిసోడ్‌ చివర్లో హౌస్‌లోకి లోక నాయకుడు.. భారతీయుడు వస్తున్నాడని హోస్ట్‌ నాని హౌస్‌ మేట్స్‌కు తెలియజేస్తున్న ఓ ప్రోమోను చూపించారు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన ఇంటి సభ్యులు తమ అభిమాన హీరోను చూసి పులకించిపోయారు. కాళ్ల మీద పడుతూ తమ అభిమానం చాటుకుంటూ ఘనస్వాగతం పలికారు. అయితే ఇది ఈ ఎపిసోడ్‌లో ప్రసారం కానుంది. ఇక విశ్వరూపం 2 ఆడియో రిలీజ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన కమలహాసన్‌.. ఆ చిత్ర ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్‌ కోసమే ఈ లోకనాయకుడు బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక తమిళ బిగ్‌బాస్‌కు కమలహాసన్‌ హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ హోస్ట్‌గా.. అగ్ర హీరోగా కమల్‌ ఇంటిసభ్యులతో ఎలా గడుపుతారో చూడాలి మరి!

చదవండి: నేషనలిజానికి అర్థం నాకు తెలుసు: కమల్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top