బేగంపేటలో సందడి చేసిన రష్మిక

Heroine Rashmika Mandanna At Begumpet Airtel Office - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డియర్‌ కామ్రేడ్‌ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అన్నారు హీరోయిన్‌ రష్మిక మందన్న. బేగంపేట భారతీ ఎయిర్‌టెల్‌ కార్యాలయంలో శుక్రవారం ఆమె సందడి చేశారు. ఈ సందర్భంగా రష్మిక ‘డియర్‌ కామ్రేడ్‌’ కాంటెస్ట్‌ విజేతలను కలిసి ముచ్చటించారు. సినిమా విడుదలకు ముందే ఎయిర్‌టెల్‌.. ఏపీ, తెలంగాణల్లోని తన పోస్ట్‌పెయిడ్‌, ప్రీపెయిడ్‌ వినియోగదారులకు ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాపై ఓ కాంటెస్ట్‌ నిర్వహించింది. దానిలో గెలుపొందిన 40 మంది విజేతలు నేడు బేగంపేట ఎయిర్‌టెల్‌ కార్యాలయంలో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో  హీరోయిన్‌ రష్మిక మందన్న, భారతీ ఎయిర్‌టెల్‌ లిమిటెడ్‌ సంస్థ సీఈవో అవ్నిత్‌ సింగ్‌ విజేతలను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘ఎయిర్‌టెల్‌ సంస్థ నిర్వహించిన కాంటెస్ట్‌లో గెలుపొందిన విజేతలను కలవడం చాలా సంతోషంగా ఉంది. గత నెల 26న విడుదలయిన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను తెలుగు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఈ విజయం  ఎంతో సంతోషాన్నిచ్చింది’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top